Red Watermelon : పుచ్చకాయ ఎర్రగా ఉందని తింటున్నారా.. దాని వెనుక ఉన్న మోసం ఇదే..
ఎందుకు అనగా ఇది చాలా రసాయనాలతో నిండి ఉంటుంది అని నిపుణులు తెలిపారు. అలాంటి పుచ్చకాయలను మనం ఎలా గుర్తించాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలు ఏమిటి అనగా. వాటిని సరిగా మనం గుర్తించకపోవడం.

ఇవి క్యాండిలు, సీట్లు, పానీయాలు మొదలైన వాటికి కలిపే ఒక రకమైన ఎరువు రంగని తెలిపారు.ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాల రంగులను ఏ పండ్లలో కూడా కలపకూడదు అని ప్రభుత్వం ఎప్పుడో దానిని నిషేధించింది. FSSAI కల్తీ లేక నకిలీ పుచ్చకాయలను గుర్తించేందుకు కొన్ని ఖచ్చితమైన పద్ధతులను కూడా సూచించింది.
దీనివల్ల మీరు ఎరుపు, తాజా మరియు తీపి పుచ్చకాయలను గుర్తించి వాటిని కొనుగోలు చేసి తినొచ్చు. దీంతో నకిలీ లేక హనికారమైన పుచ్చకాయలు కొనుక్కోకుండా నివారించవచ్చు. FSSAI చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే పుచ్చకాయకు మధ్యలో కట్ చెయ్యాలి.

దాని తర్వాత ఈ రెండు భాగాలలో ఏదైనా ఒక దానిని తీసుకోండి. దాని తర్వాత ఒక చిన్న దూదిని దానికి అద్ది మొఖంపై పూసుకోండి. పుచ్చకాయ ముక్కకి ఎర్రటి గుజ్జుపై కొన్నిసార్లు రుద్దండి. పుచ్చకాయ నిజమైనది సహజమైనది అయితే మీ మొహం మీద రంగు ఉండదు..
ఈ పరీక్షలో మీ మొహం కనుక ఎర్రగా మారినట్లయితే ఈ పుచ్చకాయలు ఎరిథోసిన్ అనే రసాయనం వేసినట్లు అంచనా వేయొచ్చు.ఇంజక్షన్ల ద్వారా ఎరుపు రంగును ఈ పుచ్చకాయలో జోడించినట్లుగా అంచనా వేయొచ్చు. వీటిని తినటం అంత సురక్షితం కాదు.
ఇది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది.ఈ రసాయనాలు కనుక మీ కడుపులోకి చేరినట్లయితే కడుపునొప్పి, విరోచనాలు, వికారం,ఆకలి మందగించడం, వాంతులు లాంటి అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పుచ్చకాయని ఎక్కువగా తీసుకోవటం వలన కూడా థైరాయిడ్ వ్యాధి కూడా వస్తుంది.
