Summer Dirink : ఈ సమ్మర్ లో వేసవి తాపం నుంచి బయటపడడానికి ఈ సూపర్ డ్రింక్ ట్రై చేయండి..
అలాగే జీవన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి వేసవిలో చిన్న చిన్న పొరపాట్లు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఈ సీజన్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీలైనంతవరకు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలానే ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. మరి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐదు నిమిషాల పాటు దీనిని బాగా మరిగించాలి. దీనిలో కొద్దిగా రాక్ సాల్ట్ ను వేసుకోవాలి. ఈ మిశ్రమం వడకట్టి ఆ తర్వాత తీసుకోవాలి. ఈ కూల్ టీ ని తీసుకోవడం వలన ఎస్డిటి, వికారం ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.
పెరుగు: పెరుగు తీసుకోవడం వలన వేసవిలో మంచి మేలు జరుగుతుంది. మజ్జిగ లస్సి కూడా చేసుకుని తాగవచ్చు. ఎలా తీసుకుంటే ఇవి మిమ్మల్ని చల్లగా ఉంచుతాయి. వేడిని కూడా తట్టుకునేలా చేస్తాయి. అలానే మామూలు నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇవి కూడా డిహైడ్రేషన్ సమస్య లేకుండా చేస్తాయి. అలానే మీరు ఎక్కువగా సిస్టం ముందు కూర్చుని వర్క్ చేస్తుంటే మీ కంప్యూటర్ దగ్గర ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి.
నిమ్మరసం: నిమ్మరసం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది.
ఇలా నిమ్మరసంతో వేసవిలో బాడీ చల్లగా ఉంచుకోవచ్చు.. ముఖ్యంగా వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. పైగా పోషకాలు దీనిలో అధికంగా ఉంటాయి అలాగే కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
కీరదోస జ్యూస్: కీరదోస కూడా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలానే దానిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీంతో మలబద్దక సమస్య తగ్గుతుంది. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.. కీరదోసతో మనం నచ్చిన రెసిపీని తయారు చేసుకోవచ్చు.
కీరా రైతా : పెరుగు పచ్చడి ఇలాంటివి చేసుకొని తీసుకోవచ్చు. వీటితోపాటు పొట్లకాయని కూడా వేసవిలో అధికంగా తీసుకుంటూ ఉండాలి. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలానే నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. పొట్లకాయ కూరను కూడా చేసుకుని తీసుకోవచ్చు..