Kejriwal arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌

Kejriwal arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌

Kejriwal arrest: న్యూఢిల్లీ : మ‌ద్యం కుంభ‌కోణం మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) అరెస్ట్ చేసింది. మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టులో అరవింద్ చుక్కెదుర‌య్యింది. అరెస్టు నుంచి అత‌డికి  మినహాయింపులే ఇవ్వ‌లేమ‌ని తెలిపింది. ఆ వెంట‌నే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి సెర్చ్ వారంటీతో వెళ్లారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తున్న‌ట్లు నోటీసులు అంద‌జేశారు.

దీంతో ఆప్ కార్య‌క‌ర్త‌లు సీఎం కేజ్రీవాల్ నివాసానికి భారీగా త‌ర‌లివ‌చ్చి ఈడీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ముంద‌స్తు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. కేజ్రీవాల్ ఇంటి వ‌ద్ద భారీగా పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ వర‌కు ర‌హదారుల‌ను మూసివేశారు.

Read Also దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

218 -2

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

ఇప్ప‌టికే 9సార్లు ఈడీ స‌మ‌న్లు జారీ చేసినా కేజ్రీవాల్‌ విచార‌ణ‌కు హాజ‌రు కాలేద‌ని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సైతం రెండు సార్లు విచార‌ణ‌కు ఆదేశించిన‌ప్ప‌టికీ కేజ్రీవాల్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఢిల్లీ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ ఉంది. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఎమ్మెల్సీ క‌విత ఇటీవ‌లే అరెస్టు అయిన విష‌యం తెలిసిందే.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?