Aadhaar card : ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త... UIDAI ఇ - లెర్నింగ్ పోర్టల్ ప్రారంభం...
అదేవిధంగా ఈ పోర్టల్ ద్వారా మీరు బేస్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించడానికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ కార్డు ఎన్ రోల్ మెంట్ , ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని పనులను ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు.ఇక ఈ పోర్టల్ లో అందుబాటులో ఉన్న కోర్సులను తీసుకోవడం ద్వారా మరింత సమాచారాన్ని పొందవచ్చు.
కోర్స్ పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా పోర్టల్ కు సంబంధిత సర్టిఫికెట్ ను కూడా పొందవచ్చు. ఇక ఈ పోర్టల్ ఆధార్ కార్డు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా మీరు బేస్ ఆపరేటర్ , బేస్ సూపర్ వైజర్, సూపర్ వైజర్ వంటి సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు. తద్వారా మీరు ఆధార్ సేవా కేంద్రాలను తెరవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే ఈ పోర్టల్ లో హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా మీరు ప్రజలకు విస్తృత స్థాయిలో మీ సేవలను అందించవచ్చు. అయితే ఈ ట్రైనింగ్ ఆన్ లైన్ లోనే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉండే నేర్చుకోవచ్చు.
అర్హత , ముఖ్యమైన పత్రాలు...
ఈ పోర్టల్ ద్వారా ట్రైనింగ్ పొందాలంటే దరఖాస్తుదారులు కచ్చితంగా భారతదేశంలో శాశ్వత నివాసి గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ , ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు ధ్రువీకరణ పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , మొబైల్ నెంబర్ ఈ మెయిల్ ఐడి మొదలైనవి కలిగి ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి...
ఈ పోర్టల్ ద్వారా మీరు ట్రైనింగ్ పొందాలి అనుకుంటే అధికారిక వెబ్ సైట్ https://e-learning.uidai.gov.in/login/index.php సందర్శించాలి. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత హోం పేజ్ లో ఎన్ రోల్ మెంట్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్టర్ నౌ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీ పూర్తి వివరాలను నమోదుచేసి సబ్ మిట్ చేయాలి. ఈ విధంగా మీకు ఎకౌంట్ క్రియేట్ అవుతుంది.
కోర్స్ ఎలా ప్రారంభించాలి...
అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేయాలి. అప్పుడు మీకు పోర్టల్ లో ఉన్న కోర్సులు జాబితా కనిపిస్తుంది. మీ అవసరానికి అనుగుణంగా మీ యొక్క ఆప్షన్ ఎంచుకోండి. అనంతరం ఎన్రోల్ మీ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ యొక్క సమాచారాన్ని అందించాలి. మీరు దీనిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా కోర్స్ ను ప్రారంభించవచ్చు.
