AITUC : నల్లగొండ, ఫిబ్రవరి 13(.క్విక్ టుడే) : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 16న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. మంగళ వారం రోజున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్లు నల్లగొండ AITUC కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందని ఈ10 సంవత్సరాల కాలంలో కార్మికులకు కర్షకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు.
కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికలలో భారత్ వెలిగిపోతుంది, అచ్చేదిన్ ఆయేగా, విశ్వగురు,ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపురిత హామీలు ఇచ్చిన ఏమి ఓరగలేదని అన్నారు, బీజేపీ హయాంలో నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని,కార్మికుల వేతనాలు 20% తగ్గిపోయాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని.ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పట్టణాలకు విస్తరించాలని స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం రూ.26 వేలు, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.హమాలీ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం, బోర్డును తేవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మిక వర్గానికి సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న కార్మికులు అందరూ విధులు బహిష్కరించి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు పానేమ్ వెంకటరావు జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల లెనిన్ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాసాని వెంకటయ్య జిల్లా నాయకులు గుండె రవి, నారాయణ శ్రీనివాస్ సుధాకర్ శ్రీను రమేష్ యాదయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు.