Gundala : సాగు, తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

గుండాల త‌హ‌సీల్దార్‌కు విన‌తి

Gundala : సాగు, తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

Gundala : గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట సీపీఐ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా సీపీఐ జిల్లా నాయకులు కే హరిశ్చంద్ర మాట్లాడుతూ.. నవోపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలి. అసంపూర్తిగా వదిలేసిన దేవాదుల కాలువ ప‌నుల‌ను పూర్తి చేయాలి. వేసవి ఎద్దడి నుండి మిషన్ భగీరథ తాగునీరు అందించాలి. విద్యుత్ సమస్యను పరిష్కరించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వ్యక్తికి 200 రోజుల పని దినాలను కల్పించాలి. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేయాలి. కొత్త రుణాలు మంజూరు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలి అని ప‌లు డిమాండ్ల‌ను చేశారు.

ధ‌ర్నా అనంతరం ఎంఆర్ఓ జలజ కుమారికి  వినతి పత్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, సిపిఐ మండల రైతు సంఘం నాయకులు అత్తర్ పాత, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమురయ్య, ఏ ఐ వై ఎఫ్ మండల  అధ్యక్షులు బి శీను, మండల కార్యవర్గ సభ్యులు జి వెంకన్న, జోసెఫ్, స్వామి, సత్యనారాయణచారి, భిక్షం, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?