Gutta Amit Reddy : ఈనెల 13న కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా : గుత్తా అమిత్ రెడ్డి

Gutta Amit Reddy : ఈనెల 13న కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

Gutta Amit Reddy : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11(క్విక్ టుడే) : ఈనెల 13న న‌ల్ల‌గొండ‌లో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లో జరిగిన మీటింగ్‌ల‌లో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని అన్నారు. కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని అని,6లక్షల ఎకరాల ఆయకట్టు ఉంద‌న్నారు.

ఆయువు పట్టు మనకు కృష్ణా నది..  అలాంటి కృష్ణా జలాలను కాంగ్రెస్ పార్టీ   కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు . దీనిపై టిఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఇప్పుడే పోరాటం ప్రారంభించారని, నల్గొండ సభతోనే పోరాటం మొదలవుతుంద‌న్నారు. కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా  కటకట ఏర్పడుతుంద‌న్నారు. మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని  విడుదల చేసుకున్నాం అన్నారు. ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అని, విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంద‌న్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్యఅని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు  కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నార‌ని విమర్శించారు.

పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదని గుర్తు చేశారు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల‌లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాన‌ని అన్నారు. పార్టీ నిర్ణయమే ఫైన‌ల్‌, శిరోధార్యం అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం.. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలోకనగల్  జెడ్పిటిసి  చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్, శ్రీరామదాసు హరి కృష్ణ, నాగులవంచ వెంకటేశ్వర రావు, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, పజ్జుర్ సర్పంచ్ మొయిజ్, మాజీ జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?