Itikala Ambedkar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్‌పీని విమర్శించే స్థాయి మంత్రి కొండా సురేఖకు లేదు
బీఎస్‌పీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇటికాల అంబేడ్కర్
On
ఆర్ఎస్‌పీకి మంత్రి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి
Itikala Ambedkar: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, క్విక్‌టుడే : బీఎస్పీ చీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయనను విమర్శించే స్థాయి మంత్రికి లేదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఇటికాల అంబేడ్కర్ అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా సురేఖ తెలంగాణ ద్రోహి ఆని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలపైన మానుకోటలో రాళ్ల దాడి చేసి కాల్పులు జరిపిన చరిత్ర కొండా దంపతులదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అహంకార పూరితంగా మాట్లాడాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ రౌడీల పార్టీ, గుండాల పార్టీ అని పేర్కొనడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రౌడీల అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని అభ్యంతరకర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు రౌడీ నో ఎవరు ప్రజల మనిషినో తెలంగాణ సమాజనికి తెలుసనీ అన్నారు. మంత్రి అహంకారపూరిత వ్యాఖ్యలతో బహుజన వర్గాల్లో తీవ్రమైన భావోద్వేగం రగిలిందని ఈ వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
బహుజన నాయకుడు మచ్చలేని మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి గొప్ప నాయకుని పై అవాకులు చవాకులు మాట్లాడే ముందు తన గతం గుర్తు తెచ్చుకోవాలన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...