Nalgonda : 16న ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సమ్మె

Nalgonda : 16న ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సమ్మె


Nalgonda : నల్లగొండ.ఫిబ్రవరి 12.( క్విక్ టుడే) :  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 16న జరుగే కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్  హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాం డిపో మేనేజర్ కు, కాంట్రాక్టర్ కందుల వెంకటరమణ గౌడ్ లకు సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెబుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి 200 రోజులు పని దినాలు, రోజు కూలి 600 కేటాయిస్తూ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ సి ఐ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్ క్యాజువల్ వర్కర్స్ నాయకులు శ్రీనివాస్ యూనియన్ కార్యదర్శి సుంకరబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?