Nalgonda : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త సమ్మె
సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతల పిలుపు
Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 9. (క్విక్ టుడే ) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం ( 327- ఐఎన్టీయూసీ) జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను, నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు,సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలను అడ్డుకోపోతే భవిష్యత్తులో కార్మికులకు, ఉద్యోగులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ లన్ని పాల్గొంటున్నాయని తెలిపారు.
సమ్మె విజయవంతం కోసం ఈనెల 14న బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొయినుద్దీన్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఐఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు అవుట్ రవీందర్ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
