అంతరిక్షంలో బ్లాక్ హోల్ .. రోజుకొక సూర్యుడిని మింగేలా ఉందే..

అంతరిక్షంలో బ్లాక్ హోల్ .. రోజుకొక సూర్యుడిని మింగేలా ఉందే..

 అనంత దూరంలో విశ్వంలో అత్యంత ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతున్న ఓ పదార్థాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి సూర్యుడి కంటే 17 బిలియన్ రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న బ్లాక్ హోల్ నుంచి దానికి శక్తి సమకూరుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని క్వాసార్ అని వ్యవహరిస్తారు. దీనికి JO525-4351 అని పేరు పెట్టారు. దీనిని చీలీలోని అతిపెద్ద టెలిస్కోప్ నిర్ధారించింది. ఈ క్వాసార్ ఇంత వెలుగు విరజింపడానికి కారణం బ్లాక్ హోల్ అయితే అది అత్యంత ఆకలిగొన్న దానిలా రోజుకొక సూర్యుడంతటి ద్రవ్యరాశిని స్వాహా చేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చాలా సంవత్సరాల కిందట ఈ సమాచారాన్ని శాస్త్రవేత్తలు నమోదు చేశారు. కానీ ఇప్పుడు దానికి ఘనత ఏమిటో అర్థం చేసుకున్నారు. అయితే ఇది మానవ పరిణామానికి ముందు నుంచే వెలుగుతున్నట్లు ఇప్పటిదాకా దానిని పాలపుంతలో కనిపించే ఒక నక్షత్రంలా భావించామని, అది చాలా దూరంలో ఉందనే విషయం ఇప్పుడు గుర్తించామని శాస్త్రజ్ఞులు చెప్పారు. 

నక్షత్ర మండల కేంద్రభాగాన్ని తెలిపేందుకు శాస్త్రవేత్తలు క్వాసార్ అనే పదం ఉపయోగిస్తుంటారు. ఈ బ్లాక్ హోల్ అమితమైన వేగంతో పదార్థాలను తనలోకి లాగేసుకుంటుంది. దీని చుట్టూ తిరిగే పదార్థాలు భారీగా వెలుగును విరజిమ్ముతుంటాయి. క్వాసార్ నుంచి వెలువడిన కాంతి అతిపెద్ద టెలిస్కోప్ డిటెక్టర్స్ వద్దకు చేరడానికి 12 బిలియన్ సంవత్సరాలు పట్టింది. ఇంతలా వెలుగుతున్న ఈ పదార్థం గురించి ప్రతి విషయం ఆశ్చర్యకరం. ఇందులోని అసాధారణ విషయం ఏంటంటే ఆ బ్లాక్ హోల్ ఎంత వేగంగా ద్రవ్యరాశిని మింగుతుంది అనేది ఒక సూర్యుడు అంతటి ద్రవ్యరాశిని ఒక్క రోజుల్లో స్వాహా చేస్తుంది. ఇది నిజంగానే అంతులేని వేగం. దీనివలన అతిపెద్ద వెలుగు ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. బ్లాక్ హోల్ ద్వారా శక్తిని సమకూర్చుకుంటున్న క్వాసర్ చిమ్మే వెలుగులు 500 లక్షల కోట్ల సూర్యులకు సమానమని అంటున్నారు. 

ఈ బ్లాక్ హోల్ నుంచి వెలువడి విస్తరించే కాంతి వ్యాసార్థం ఏడు కాంతి సంవత్సరాలకు సమానంగా ఉంది. అంటే సుమారుగా సూర్యుడికి నెప్ట్యూన్ కి మధ్య ఉన్న దూరం కంటే 15 వేల రెట్లు ఎక్కువ. నక్షత్రం మండలాలన్నింటికి అంతర్లీనంగా అత్యంత శక్తివంతమైన బ్లాక్ హోల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బహుశా గెలాక్సీలు ఏర్పడడానికి కారణం ఇదే అంటున్నారు. ఈ బ్లాక్ హోల్స్ కనుక లేకపోయి ఉంటే బహుశా ఈ రోజు మనం చూస్తున్న గెలాక్సీలు మరో విధంగా ఉండేవేమో. వాస్తవానికి ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ లేకపోయి ఉంటే గెలాక్సీలు భిన్నంగా ఉండేవి. బహుశా గెలాక్సీలను ఈ బ్లాక్ హోల్స్ చుట్టూనే ఉండే అవకాశం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విశ్వంలో బ్లాక్ హోల్స్ ఇంత త్వరగా ఎలా పెద్దవిగా మారాయి అనేది ఆశ్చర్యకరం. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన వాయువుల నుంచి బహుశా నక్షత్రాలు ఏర్పడకముందే నేరుగా ఈ పదార్థాలు పెరిగాయనే కోణాన్ని పరిగణించే దిశగా శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?