వాట్సాప్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. స్టేటస్, ఛానల్స్ కు కొత్త అప్‌డేట్

వాట్సాప్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. స్టేటస్, ఛానల్స్ కు కొత్త అప్‌డేట్

ప్రస్తుతం వాట్సాప్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా వినియోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. చిన్నవాళ్ళ నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వాట్సాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే వాట్సాప్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే వాట్సాప్ కూడా తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే చాలా ఫీచర్స్ ని పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం మెసేజ్ లు మాత్రమే కాదు స్టేటస్, ఛానల్స్, కాల్స్ , లవీడియో కాల్స్ లాంటి అనేక ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపుగా ఐదు బిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు సరికొత్త అప్డేట్లను ప్రవేశ పెడుతూ యూజర్ యాక్సిస్బిలిటీ మెరుగుపరుస్తూ ఉంటుంది.

  ఈ క్రమంలోనే వాట్సాప్ తమ వినియోగదారుల కోసం కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. స్టేటస్ రివ్యూ తో పాటు ఛానల్ జాబితాను రీ డిజైన్ స్టేటస్ బార్ సరికొత్తగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ సరికొత్త అప్డేట్ కేవలం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  త్వరలోనే వాట్సాప్ వినియోగదారులందరికీ ఈసారి కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే యాప్ వర్షన్ లో రీ డిజైన్ చేసిన స్టేటస్ ట్రైను వాట్సాప్ వినియోగదారులు గమనించవచ్చు. ట్యాబ్ తెరిచినప్పుడు ట్రై యాక్సిస్ చేయడం చాలా ఈజీ. అంటే వాట్సాప్ లో స్టేటస్ చూడాలంటే వ్యక్తులు షేర్ చేసిన స్టేటస్ పై క్లిక్ చేస్తే గానీ ఓపెన్ కాదు. అయితే కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తే క్లిక్ చేయకుండా స్టేటస్ చూడవచ్చు. వాట్సాప్ ఛానల్ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి కొత్త ఎంపికను పరిచయం చేసింది. అంటే ప్రస్తుత యజమాని కొత్త అర్హత గల యూజర్ ని ఎంచుకొని బదిలీ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ అప్డేట్ అనుమతిస్తుంది. దీనితో కొత్త యజమాని సెట్టింగ్లు సమాచారాన్ని నిర్వహించడం ఛానల్ ని తొలగించడం ఇతర నిర్వాహకులకు తొలగించడం లాంటి నిర్వహణ హక్కులు పొందుతారు. 

ఈసారి కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తే వాట్సప్ ఛానల్ పై మరింత సౌలభ్యని నియంత్రణను అందిస్తోంది. ఇక ఇటీవల వాట్సాప్ ఛానల్ అనే ఫీచర్ ను తెచ్చింది. ఎవరైనా ఎవరి ఛానల్ అయినా ఫాలో కావచ్చు. వారి పోస్టులను చూడవచ్చు. వారు ఫాలో అవుతున్న ఛానల్ వివరాలు వేరే వ్యక్తులకు మాత్రం తెలియదు. ఒక్క ఛానల్ అడ్మిన్ కి తప్ప ఆ ఛానల్ ను ఫాలో అవుతున్న మిగిలిన ఫాలోవర్లో కు ఆ విషయం తెలియదు. ఇటీవల దేనిని వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఇంకా కొంతమందికి వాట్సాప్ ఛానల్ అంటే ఏంటో తెలియదు. వాటి ప్రయోజనం అర్థం కావడం లేదు. టెక్స్ట్ లు వీడియోలు సందేశాలను పంచుకోవడానికి వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ గా పనిచేసే ఫీచర్ వాట్సాప్ ఛానల్. ఇది ఎక్కువ మంది ప్రేక్షకులకు సందేశాలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంటే అనుసరించే వ్యక్తులు సంస్థల నుంచి అప్డేట్లను పొందటానికి కొత్త ప్రైవేట్ మార్గం. అయినా వాట్సాప్ ఛానల్ కు అందరిని పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామని మెటా వార్తలు అప్డేట్లను షేర్ చేయడానికి ఈ ఛానల్ ని ప్రారంభిస్తున్నామని, ప్రపంచమంతా కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నామని జూకర్ బర్గ్ తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?