ఆధార్ కార్డును ఇలాంటి వాటికి వినియోగిస్తున్నారా.. దొరికిపోతారు జాగ్రత్త

ఆధార్ కార్డును ఇలాంటి వాటికి వినియోగిస్తున్నారా.. దొరికిపోతారు జాగ్రత్త

ప్ర‌స్తు రోజుల్లో ఆధార్ కార్డు ప్ర‌తి డాక్యుమెంకు అనుసంధానం చేస్తున్న విష‌యాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధార్ అనేది ప్రభుత్వం తరపున ప్రతి భారతీయ నివాసికి UIDAI అందించిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ డేటాబేస్‌లో సేవ్ చేసే బయోమెట్రిక్ పత్రం. 2016 ఆధార్ చట్టం ప్రకారం ప్రతి నివాసి ఆధార్ నంబర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ముఖ్యమైన డాక్యుమెంట్. మ‌న దేశంలో బ్యాంక్ అకౌంట్ నుంచి సిమ్ కార్డు వ‌ర‌కు ప్ర‌తి  ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి అవసరం. ఇలాంటి కీలకమైన కార్డును అంతే జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందుకే భారతీయులు ఆధార్ కార్డు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ పథకాన్ని సమీక్షిస్తుంది. ఆధార్ చట్టం దాని నిబంధనల ప్రకారం ఆధార్ సమాచారాన్ని సేకరించే ఏ సంస్థ అయినా వివరాలను భద్రంగా ఉంచుకోవాలి. చట్టానికి అనుగుణంగా వివరాలను ఉపయోగించాలి. 

సైబ‌ర్‌ నేరగాళ్ల చేతికి ఆధార్ కార్డు వివరాలు చిక్కకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలి. అలాగే కొన్ని పనులను అసలు చేయకూడదు. చాలా సర్వీసులకు ఓటీపీ అవసరం అవుతుంది. కాబట్టి ఆధార్ తో మొబైల్ నెంబరు ఎల్లప్పుడు అప్డేటెడ్ గా ఉంచుకోవాలి. 12 అంకెల ప్రత్యేక సంఖ్య అయిన ఆధార్ ఒక డిజిటల్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. గుర్తింపు రుజువు చేయడానికి మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా పాస్ పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ లేదా రేషన్ కార్డు వంటి ఇతర ఐడీల మాదిరిగానే దీనిని ఉపయోగించవచ్చు. ఒక ఎంటీటీ ఆధార్ వివరాలు అడిగినప్పుడు అవసరాలను ఉద్దేశాలను స్పష్టంగా చెప్పమని అడగాలి. ఆధార్ కార్డు నెంబర్ లేదా కాపీలను వేరే వ్యక్తికి ఇచ్చే ముందు వారు ఎందుకు అడుగుతున్నారు అడిగి తెలుసుకోవాలి. UIDAI వెబ్సైట్ లేదా m - ఆధార్ యాప్ ద్వారా గత ఆరు నెలలుగా ఆధార్ అథెంటిఫికేషన్ హిస్టరీని తనిఖీ చేయాలి మీకు తెలియకుండా మీ డాక్యుమెంట్ ను ఎవరైనా వాడితే ఇక్కడ తెలిసిపోతుంది. దీంతో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు.

ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు. కొంతకాలం పాటు ఆధార్ కార్డును ఉపయోగించుకోకుంటే దానిని లాక్ చేయవచ్చు. అవసరమైనప్పుడు సులువుగా తక్షణమే అన్ లాక్ చేయవచ్చు.  UIDAI ఈ మెయిల్ కు ఒక అథంటికేషన్ ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తాయి.  అందుకోవడానికి ఈమెయిల్ అడ్రస్ ను ఆధార్ తో అప్డేట్ చేయాలి. ఆధార్ నెంబర్ షేర్ చేయకూడదు అనుకుంటే UIDAI అందించే ఒక ఆప్షన్ తో వర్చువల్ ఐడెంటిఫైయర్ ను జనరేట్ చేయవచ్చు. ఈ తాత్కాలిక నెంబర్ ను ఆధార్ నెంబర్ కు బదులుగా ఆర్థరైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఒక క్యాలెండర్ డే తర్వాత మళ్లీ దీనిని జనరేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినట్లు అనుమానం వస్తే UIDAI టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1947 కి కాల్ చేయవచ్చు. ఈ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇక ఆధార్ కార్డు వివరాలను ఎవరికి షేర్ చేయకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది.  m - ఆధార్ యాప్ పిన్ ని కూడా ఎవరితో షేర్ చేయకూడదు. ఆధార్ లెటర్, పివిసి కార్డు లేదా కాపీలను ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో పడేయకూడదు. అనధికార సంస్థలకు ఆధార్ కార్డు ఓటీపీని అసలు షేర్ చేయకూడదు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?