PAN card alert: పాన్ కార్డుతో జర జాగ్రత్త... ఈ తప్పులు చేస్తే 10,000 ఫైన్...
వ్యాపారులకు, ఉద్యోగులకు పాన్ కార్డు సుపరిచితమే. వీళ్ళ దగ్గర కచ్చితంగా పాన్ కార్డు ఉండి తీరుతుంది. అయితే పాన్ కార్డు విషయంలో పొరపాట్లు జరిగితే మొదటికే మోసం అవకాశం ఉంది. దీతో భారీ మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. పాన్ కార్డుకు సంబంధించినంతవరకు ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చిన లేదా రెండు కార్డులు కలిగి ఉండటం కూడా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.దీనికిరూ.10 వేలు వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
దీనికోసం పాన్ వివరాలు ఎక్కడైనా ఫామ్ లో నింపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.పాన్ కార్డు పై మొదట ఐదు ఆంగ్ల అక్షరాలు తర్వాత నాలుగు అంకెలు మళ్లీ చివర్లో ఆంగ్ల అక్షరాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. చాలామంది సున్నా,ఒక ఆంగ్ల అక్షర ఉన్నచోట గుర్తించే సందర్భంలో పొరపాట్లు చేస్తారు.అయితే చట్టప్రకారం ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే అది కూడా చట్టరీత్యా నేరం.ఆదాయ పన్ను దర్యాప్తు విషయంలో మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉన్నట్లుగా తేలితే భారీగా జరిమానా కట్టాలి
అంతేకాక అధికారులు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ను తీసివేయటం లాంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అందుకని మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే వెంటనే ఇచ్చేయండి.ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఎలా ఉంటాయి అని అనుమానం రావచ్చు..చాలామంది వరకు పాన్ కార్డులు ఏవైనా తప్పులు ఉన్నట్లయితే దానిని సరిదిద్దుకోకుండా మరో కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేస్తారు. దీనివల్ల రెండు పాన్ కార్డులు కలిగి ఉండటానికి దోహద పడుతుంది.

కార్డు కోసం అప్లై చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కార్డు వచ్చే అవకాశాలు ఉండవు.దీనివల్ల కొందరు మళ్లీమళ్లీ ఇలా అప్లై చేస్తూనే ఉంటారు.అందువల్ల కొత్త పాన్ కార్డుకు అప్లై చేసే ముందు పాన్ స్టేటస్ చెక్ చేసుకోవటం చాలా మంచిది. ఇక మహిళలు పెళ్లి అయిన తర్వాత వారి ఇంటిపేరు మార్చుకోవటానికి కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేస్తారు. అయితే పెళ్లి అయ్యాక పాన్ కార్డులో కరెక్షన్స్ ను సరి చేసుకుంటే చాలు.పాన్ కార్డును ఆప్ లైన్ తొలగించటం కోసం ముందు మీరు ఫామ్ 49A లో మీ సమాచారాన్ని నింపవలసి ఉంటుంది
దాని తర్వాత దగ్గరలో NCDCL కేంద్రం దగ్గరకు వెళ్లి మీ డీటెయిల్స్ ఇవ్వాలి.అక్కడ పాన్ కార్డుతో సహా అధికారులు అడిగిన వివరాలు మీరు సమర్పించాలి. అంతకంటే ముందు ఆదాయ కన్ను శాఖ సంబంధిత అధికారికి ఒక లేఖ రాయాల్సి ఉంటుంది.తర్వాత డూప్లికేట్ ఫామ్ సమర్పించినట్లుగా ఒక రసీదు తీసుకోవాలి.ఆన్ లైన్ అయితే పాన్ సర్వీస్ పోర్టల్ లోకి వెళ్లి చేంజ్ or కరెక్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పూర్తి డీటెయిల్స్ ను ఎంటర్ చేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలి..
