Phone Lost : ఫోన్ పోయిందని బాధపడకండి.. స్విచ్ ఆఫ్ అయినా ఇలా ఈజీగా కనిపెట్టొచ్చు..
ఈ ఫోన్ ను మనం పడుకునే టైంలో తప్ప ఒక గంట సేపు కూడా వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో పదిమందిలో ఎనిమిది మంది స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. మన జీవితంలో ఫోన్ అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారింది. ఈ ఫోన్ చేతిలో ఉంటే చాలు చుట్టు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు.ఈ స్మార్ట్ ఫోన్ కి అంత ప్రాముఖ్యత ఉంది..
చాలామంది ఈ ఫోన్ లోనే అన్ని పనులు చేస్తారు. కొంతమంది ఈ ఫోన్ లను వేలకు వేలు,లక్షలకు లక్షలు పెట్టి కొంటారు. అలాంటప్పుడు ఈ ఫోన్ ఎక్కడైనా పడిపోతే. ఇంకేమైనా ఉందా. అంతే సంగతులు. అది ఎక్కడ పడిందో మన చేతికి ఎలా వస్తుందో కూడా తెలియదు. అయితే ఫోన్ పోగొట్టుకున్న వారికే ఈ న్యూస్. మీ ఫోన్ పోయిన సరే ఈజీగా కనిపెట్టవచ్చు.
ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్న నెట్ వర్క్ లేకపోయినా మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనగా గూగుల్ ప్రస్తుతం తన ఫైండ్ మై డివైజ్ ఫిచర్లను అప్ డేట్ చేస్తుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ 9, దాని తర్వాత వెర్షన్లకు మాత్రమే ఇది సపోర్ట్ చేయగలదు.

ఈ అప్ డేటెడ్ వెర్షన్ నెట్ వర్క్ లేకపోయినా బ్లూటూత్ ఫ్రాక్సీ మీటి వలన ఇది పనిచేస్తుంది. యాపిల్ ఫోన్ లో గల ఫైండ్ మై డివైస్ నెట్ వర్క్ లాగా ఇది పనిచేస్తుంది.అయితే ఇది ఆపిల్ కంటే కూడా ఎంతో శక్తివంతమైనది.పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా వాటి యజమానులు దానిని ఈజీగా కనిపెట్టవచ్చు అని గూగుల్ తెలిపింది.
దానికోసం వాటిలో స్పెషలైజ్డ్ హార్డ్ వేర్ ను ఇందులో ఉపయోగించారు. ఈ ఫీచర్ ఇప్పుడు కెనడా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తున్నట్లుగా గూగుల్ తెలిపింది..
