iPhone hacked: మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా.? అయితే మీ ఐఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం.. ఇలా చేసి బయటపడండి..
కాబట్టి ఈ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయండి. ఐఫోన్ బ్రాండ్ కు ఉండే క్రేజ్ వేరు. చాలామంది ఈ ఫోను కొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ మెన్లు ఇంకా ఎందరో లక్షల రూపాయలు పెట్టి ఈ ఐఫోన్లను కొని వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే డిజైన్ పరంగా క్వాలిటీ, సెక్యూరిటీ, సేఫ్టీ ఇంకా ఇతర ఎన్నో ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.
ఇంకోవైపు కొన్ని మల్వేర వైరస్లు కొన్ని ట్రిక్స్ తో హ్యాకర్ల టీం ఆపిల్ ఫోన్ సైతం హాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. హై ఫోన్ యూజర్లు చేసే కొన్ని పొరపాట్ల వలన వ్యక్తిగత సమాచారం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సస్పెక్ట్ లింకుల పట్ల జాగ్రత్తలు:
అనుమానాస్పద లేదా నకిలీ లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఈ లింకులపై క్లిక్ చేయడం వల్ల మీరు వాడే ఐఫోన్ హ్యాకింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు వచ్చిన ఏదైనా లింకులపై క్లిక్ చేసే ముందు దాన్ని యు ఆర్ ఎల్ పేరు స్పెల్లింగ్ ను బాగా తనకి చేసుకోవాలి.
ఐఫోన్ లోను కొన్ని లోపాలు:
కొత్తగా వచ్చిన ఐఫోన్ అయినా లేదా పాత స్మార్ట్ ఫోన్ అయినా ప్రతి ఒక్క దానిలో కొన్ని రకాల లోపాలు అయితే ఉంటాయి. వీటిని గురించి నిపుణులు ప్రభుత్వం నిర్దిష్ట సమయంలో హెచ్చరికను జారీ చేసింది. కావున మీరు వాడే ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం నకిలీ యాప్లను ఇన్స్టాల్ చేయడం తదితర సెక్యూరిటీ ప్రైవసీ సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు చేస్తూ రావాలి. అప్పుడే మీ ఫోన్లో డేటా సురక్షితంగా ఉంటుంది.
ఇతరులకి ఫోను ఇవ్వద్దు;
ఐఫోన్ తప్పుడు వ్యక్తి చేతుల్లోకి వెళితే వారు మీ ఫోన్ స్పైడర్ను ఇన్స్టాల్ చేయవచ్చు. దాని ఫలితంగా మీ ఫోన్ డేటా ఈమెయిల్ కూడా హ్యాకర్లు ఈజీగా ఆడ్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి..
స్ట్రాంగ్ పాస్వర్డ్:
ఎవరైనా హైక్ లోడ్ కి ఫోను బ్యాకప్ చేస్తే బలమైన పాస్వర్డ్ వినియోగించాలి. మీ సెక్యూరిటీ లెవెల్స్ పెంచడానికి ఆపిల్ రెండు రకాల ప్రమాణికరణను ఆన్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ను పెట్టుకోవాలి. మీరు ఐఫోన్లు వినియోగిస్తుంటే దానిలోని సాఫ్ట్వేర్ పై చాలా పరిమితులు ఉన్నాయని గుర్తించాలి.
యాప్ పర్మిషన్స్;
ఇప్పుడు వాడే ఫోన్లలో అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు కార్యాచరణకు మించి అనేక పర్మిషన్లు అడుగుతూ ఉంటాయి. మీరు యాప్ ని డౌన్లోడ్ చేస్తున్న అనవసరమైన విషయాల గురించి పర్మిషన్ కోరుతుంటే అప్రమత్తం అవ్వాలి. ఆ టైంలో ఆ యాప్ రివ్యూలు రేటింగులు సెక్యూరిటీ గురించి చెక్ చేస్తూ ఉండాలి.
అప్ టు డేట్:
మీరు వాడుతున్న ఈ ఫోన్లో వైరస్ లేదా హానికరమైన సాఫ్ట్వేర్ ఏది ప్రవేశించలేదని నిర్ధారించేందుకు ఆపిల్ అనేక రకాల అప్డేట్లను విడుదల చేసింది. ఫోన్ సెట్టింగ్లకు వెళ్లి ios సాఫ్ట్వేర్ క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి. అప్పుడు మీ ఫోన్ వైరస్ ఫ్రీ అవుతుంది దీంతో మీరు ప్రశాంతంగా ఉండవచ్చు..