NASA research moon : ఇక చంద్రుడిపై టైమ్ తెలుసుకోవ‌చ్చు.. నాసా కీలక పరిశోధనలు..!

NASA research moon : ఇక చంద్రుడిపై టైమ్ తెలుసుకోవ‌చ్చు.. నాసా కీలక పరిశోధనలు..!

NASA research moon :  టైమ్ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. అమెరికాకు,భారత్ కు మధ్య సుమారు 12 గంటల తేడా ఉంటుంది. అంతేకాదు ప్రతి దేశానికి నడుమ సమయంలో వ్యత్యాసం ఉంటుంది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రుడుతో పాటు ఇతర గ్రహాల మీద సమయం ఎంతో తెలుసుకొనేలా లునార్ స్టాండర్డ్ టైమ్ ను ఫిక్స్ చేయాలని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదేశించింది.

 2026 డిసెంబర్ 21 లోపు చంద్రుడిపై ప్రమాణిక సమయాన్ని తయారు చేయాలని వైట్ హౌస్ నిర్ణయించింది.దానికి కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ ఎల్ టీసి అని పేరు కూడా పెట్టింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రష్యాలోనో,అమెరికాలోనో ఇప్పుడు టైం ఎంత అయ్యిందో అని అప్పుడప్పుడు మనం అనుకుంటూనే ఉంటాము. భవిష్యత్తులో కూడా చంద్రుడు పై టైం ఎంత అయిందో అనుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. జాబిల్లి మరియు ఇతర గ్రహాలపై  టైం తెలుసుకునేలా ఒక ఏకికృత ప్రమాణిక టైంను నిర్ధారించాలని శ్వేత సౌధం నుండి నాసాకు ఆదేశాలు పంపారు.

93 -1

ఈ విషయం గురించి ఓ ఆంగ్ల వార్త సంస్థ తెలిపింది. చంద్ర యాత్రలకు దేశాలు, ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్న టైం లో ఈ ఆదేశాలు వెలువడటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. శ్వేత సౌధంలోని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చీప్ పార్టీ ప్రభాకర్ పంపిన ఆదేశాల ప్రకారం నాసా వేరే ప్రభుత్వ విభాగాలతో కలిశాయి.

ఇవి 2026 నాటికల్లా కోఆర్డినేటెడ్ లూనార్ టైం కొరకు వ్యూహాన్ని సిద్ధం చేయాల్సి ఉంది. గురుత్వాకర్షణ శక్తిలోని తేడాల కారణం వలన టైం నిర్ధారణ  చోటు చేసుకున్నటువంటి మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయవలసి ఉంది. ఇవి చంద్రయాత్రలకు వెళ్ళగలిగే వాహక నౌకలు, ఉపగ్రహాలు కచ్చితత్వం లో పనిచేసేందుకు ఇది చాలా ముఖ్యం.

సాధారణంగా మన భూమిపై పనిచేసే గడియారం చంద్రుడు పై చేరినట్లయితే రోజుకి 58.7 మిల్లి సెకండ్ లను ఇది కోల్పోతుంది అని ఓఎస్ టీపి ఆదేశాల్లో తెలిపారు.దీనిపై నాసాకు చెందినటువంటి స్పేస్ కమ్యూనికేషన్స్ అండ్  నావిగేషన్ చీప్ కెవిన్ కాగ్గీన్స్ మాట్లాడారు.. భూమిపై గల గడియారం ఒక వేగంతో కదిలితే, చంద్రుడి ఉపరితల పైకి వెళ్ళగానే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుంది.

93 -3

మీరు అమెరికా నేవల్ అబ్జర్వేటరీ లో హలో గడియారాలు గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది అమెరికా హృదయ స్పందన తో సమానం. ప్రస్తుతం మీరు చంద్రుడు పై హృదయ స్పందన తెలుసుకోవాలని అనుకుంటున్నారా అని తెలిపారు. నాసా ఆర్ట్ మిస్ కార్యక్రమాలను అనుకూలంగా కొత్తగా ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి.

వ్యోమగామాలను పంపించటం చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయటం లాంటి దీని లక్ష్యాలు. డేటా ప్రసారంలో, కమ్యూనికేషన్లో సమన్వయం కోసం సిఎల్ టి అవసరమే ఎంతో ఉంది.ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో ఓఎస్ టీపి మార్గదర్శకాలు ముఖ్య పరిణామాలుగా  చెప్పుకోవచ్చు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?