Noise Smart Watch : 1.85అంగుళాల డిస్ ప్లే..7 రోజుల బ్యాటరీ లైఫ్ తో నాయిస్ స్మార్ట్ వాచ్...
ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయిన నాయిస్ తాజాగా ఓ కొత్త స్మార్ట్ వాచ్ మన ముందుకు తీసుకు వచ్చింది. మన బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ వాచ్ ప్రవాహం కొనసాగుతుంది.
ఈ స్మార్ట్ వాచ్ అనేది కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది అని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్ లో నైయిస్ సంస్థ కొత్త స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసింది. కలర్ ఫిట్ పల్స్ 4 ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 1.85 అంగుళాల ఆమోలైడ్ డిస్ ప్లే ను కలిగి ఉన్నది. మరియు ఆల్ వెజ్ ఆన్ డిస్ ప్లే, 600 నీట్స్ గరిష్ట బ్రైట్ నేస్ ను కలిగి ఉన్నది.

ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ యాపిల్ తరహా డిజైన్ ను కలిగి ఉన్నది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 4 స్మార్ట్ వాచ్ 390*450 పిక్సల్ రిజల్యూషన్ తో 1.85 అంగుళాల ఆమో లైడ్ డిస్ ప్లే ను కలిగి ఉన్నది. అంతేకాక 600 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ తో ఇది రిలీజ్ అయింది. ఈ వాచ్ ఆల్ వేజ్ ఆన్ డిస్ ప్లే ఫిచర్ ను కలిగి ఉంది. దీని ఫలితంగా స్మార్ట్ వాచ్ నుండి కాల్స్ ను కూడా స్పందించవచ్చు..
IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా మన ముందుకు వస్తుంది. ఈ కలర్ ఫిట్ పల్స్ 4 స్మార్ట్ వాచ్ నాయిస్ ఫిట్ యాప్ ద్వారా అన్ని వివరాలను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 4 స్మార్ట్ వాచ్ ను ఎన్నో రంగులలో మీరు కొనుగోలు చేయవచ్చు. జెట్ బ్లాక్,ఫారెస్ట్ గ్రీన్, స్పేస్ బ్లూ, రోజ్ గోల్డ్ పింక్, స్టార్ లైట్ గొల్డ్, సిల్వర్ లింక్ మరియు బ్లాక్ లింగ్ వేరియంట్లలో మీరు కొనుగోలు చేసుకోవచ్చు.
ఇది డిజైన్ పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 4 స్మార్ట్ వాచ్ 2 వేరియంట్లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ.2,499 గా ఉన్నది. అదే మోస్ మోటల్ వేరియంట్ ధర రూ.2,799 గా ఉన్నది. ఈ స్మార్ట్ వాచ్ లో ఏప్రిల్ 26వ తేదీ నుండి నాయిస్ అధికారిక వెబ్ సైట్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు..