Smart Phone Hacked : మీ స్మార్ట్ ఫోన్ లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే హ్యాకింగ్ కు గురైనట్లే..
కాబట్టి. ఇలాంటి టైమ్ లో మీ స్మార్ట్ ఫోన్ ను హ్యాకర్లు హ్యాక్ చేసి ఉంటే ఇలా గుర్తించవచ్చు అని నిపుణులు తెలిపారు. ఇంతకీ అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా సార్లు మీ ఫోన్ లో కొన్ని విచిత్రమైన మార్పులు చూసే ఉంటారు. మీ ఫోన్ మీ అదుపులో లేకుండానే తనంతట తానే ఆపరేట్ అవటం మీరు చూసే ఉంటారు.

అంతేకాదు కొన్నిసార్లు మీ ఫోన్ పని చేయటం కూడా మానేస్తుంది. ఇలా జరిగినప్పుడు మీరు ఫోన్ హ్యాంగ్ కు గురైంది అని అనుకుంటారు. కానీ నిజానికి మీ ఫోన్ హ్యాకింగ్ చేయబడింది అని అర్థం. ఇలా జరిగినప్పుడు మీరు దానిని సాధారణ సమస్యగా భావిస్తారు. మీ స్మార్ట్ ఫోన్ లో ఏదైనా వింత జరుగుతూ ఉంటే దానిని సాధారణ సమస్య అని అనుకోకూడదు. ఎందుకు అంటే ఇది మీ స్మార్ట్ ఫోన్ కు సమస్యగా నిరూపించవచ్చు..
మీ ఫోన్ లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న టైంలో అదే పనిగా ఏదో ఒక పాపప్ లు వస్తూ ఉన్నట్లయితే మీరు వెంటనే అలర్ట్ కావాలి..ఇది కూడా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లే అని అర్థం చేసుకోండి. ఇలాంటి టైం లో వచ్చే ఎలాంటి పాపప్ లను కూడా ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు అని సైబర్ నిపుణులు తెలిపారు..
ఇక మీ ప్రమేయం అనేది లేకుండా మీ స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్స్ ఏవైనా డౌన్ లోడ్ అయినట్లయితే అప్పుడు మీ ఫోన్ హ్యాకింగ్ కు గురి అయినట్లు అని తెలుసుకోవలి అని నిపుణులు తెలిపారు. కావున ఇలాంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫోన్ వాడకపోయినా సరే అది వేడెక్కుతున్నట్లయితే అది కూడా ఫోన్ హ్యాకింగ్ కు గురి అయినట్లు అని తెలుసుకోవాలి.
హ్యాకింగ్ కు గురైనటువంటి ఫోన్ లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. కావున మీకు తెలియకుండానే మీ ఫోన్ వేడిగా మారుతుంది. అంతే కొన్ని అదేపనిగా తెలియని మెసేజ్ ల నుండి స్పమ్ కాల్స్ వస్తూ ఉన్న లేక మెసేజ్ వస్తున్నా మీరు వెంటనే అలర్ట్ కావాలి. అంతేకాక మనకు తెలియకుండానే స్క్రీన్ లాక్, యాంటీ వైరస్ లాంటి భద్రత ఫిచర్లు డిసేబుల్ అయినా కూడా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు అని అర్థం చేసుకోండి.
మీ స్మార్ట్ ఫోన్ నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా మరొక యాప్ ఓపెన్ అయినట్లయితే మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానిలో ఏదైనా చేస్తే దాని సమాచారం అంతా కూడా హ్యాకర్లకు చేరే అవకాశం ఉంది.
మీ స్మార్ట్ ఫోన్ పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా షాట్ డౌన్ అయితే లేదా డిస్ప్లే మళ్లీ మళ్లీ ఆన్,ఆఫ్ అవుతూ ఉంటే,అది కూడా హ్యాక్ చేయబడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది చాలా మంది వ్యక్తులలో చాలా సార్లు జరిగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు మీ ఫోన్ ను ఆఫ్ చేయాలి. దానిని అస్సలు ఉపయోగించకూడదు..