solar eclipse effect : గ్రహణానికి, మొర్రికి సంబంధం ఏమిటి... సూర్యగ్రహణం వలన పిల్లల్లో మొర్రి వస్తుందా...?

 solar eclipse effect : గ్రహణానికి, మొర్రికి సంబంధం ఏమిటి... సూర్యగ్రహణం వలన పిల్లల్లో మొర్రి వస్తుందా...?

solar eclipse effect : సంపూర్ణ సూర్యగ్రహణం అనగా ఒక ఖగోళ సంఘటన ఇది.ఇది ఏర్పడినప్పుడల్లా ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది.కానీ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మాత్రం అన్ని దేశాలలోని ప్రజలు చూడటం వీలు కాదు. కొన్ని దేశాలలోని ప్రజలు మాత్రమే దీనిని చూడగలరు. ఈసారి ఏప్రిల్ 8వ తారీకున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు. సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, కెనడా,మెక్సికో వంటి దేశాలలో మాత్రమే పూర్తిగా ఇది కనిపిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించక పోయినప్పటికీ కూడా గర్భంతో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.ఎందుకు అనగా సూర్య గ్రహణ టైంలో గర్భిణీలు జాగ్రత్తగా లేకపోతే వారికి గ్రహణం మొర్రి ఉన్న పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి అంటున్నారు.

ఈ గ్రహాల టైంలో తల్లి గర్భంలోని పిండంపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. గ్రహణ టైంలో బయటకు వెళ్ళటం వల్ల కూడా గర్భస్రావం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల గ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు పూర్వం నుండి కూడా సూర్యగ్రహణాన్ని చూడకూడదు అనే ఒక నమ్మకం ఉంది. దీని ప్రభావం వల్ల పిండానికి హాని కలుగుతుందని అంటున్నారు.

అయితే ఈ నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. పిండం అనేది తల్లి గర్భంలో ఉంటుంది.గర్భంలోని పరిస్థితులు అన్నీ కూడా చక్కగా ఉన్నట్లయితే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. పిండానికి సూర్యరశ్మి డైరెక్ట్ గా  ప్రభావితం కాదు.కాబట్టి పిండం ఆరోగ్యానికి సూర్య గ్రహణానికి ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాక సూర్యగ్రహణం టైం లో పుట్టిన పిల్లలకు లేక గ్రహణం టైం లో తల్లి కొన్ని పనులు చేయటం వలన పిల్లల్లో గ్రహణ మొర్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటారు.

66 -2

ఇది నిజం అని సైన్సు నిర్ధారించలేదు. గ్రహణం మొర్రి లాంటివి పుట్టుకతో వచ్చే లోపాలు మాత్రమే.వాటికి జన్యుపరమైన కారణాలు లేక తల్లి ఆరోగ్య సమస్యల వలన వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.అలాగే సూర్య గ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించకపోతే గర్భ శ్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటారు. దీనికి కూడా ఎటువంటి శాస్త్ర ఆధారాలు లేవు..

గ్రహణం టైం లోనే కాక గ్రహణం లేని టైంలో కూడా తల్లి జాగ్రత్తగా ఉండకపోయినా లేక జన్యుపరమైన కారణాలు ఉన్నట్లయితే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.సైన్స్ చెప్పిన ప్రకారం చూసినట్లయితే సూర్య గ్రహణాలు గర్భిణీ స్త్రీలకు వారి గర్భంలో ఉన్న బిడ్డలకు ఎటువంటి ప్రత్యక్ష హాని కలిగించవు అని చెబుతున్నారు. గ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లో సురక్షితంగా ఉంటే చాలు.

గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడాలనుకున్నట్లయితే కంటికి రక్షణ ఇచ్చే గ్లాసెస్ పెట్టుకొని చూడటం చాలా మంచిది. గర్భిణీలకు గ్రహణానికి సంబంధించిన భయాలు కానీ ఆందోళనలు కానీ ఉన్నట్లయితే అవి ఒత్తిడిని పెంచుతాయి. భావోద్వేగాలను కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండాలి. గ్రహణ టైంలో మీకు గాని మీ శిశువుకు గాని ఎటువంటి హాని జరుగుతుందని చెప్పటం లేదు.

ఒత్తిడి, ఉద్వేగాన్ని తగ్గించటానికి శ్వాస వ్యాయామాలు,ధ్యానం లాంటివి చేయడం మంచిది. సూర్య గ్రహణ టైంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.కావున గర్భిణీ స్త్రీలు ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. అంతేకాక కాఫీ,టీలకు కూడా చాలా దూరంగా ఉంటే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. అంతేకాక ఎంతో విశ్రాంతిని కూడా తీసుకోవాలి. గర్భిణీ తో ఉన్నప్పుడు భయాలు పెట్టుకున్నట్లయితే అలసటగా,అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది.

66 -3

కావున చాలా ప్రశాంతంగా మీకు నచ్చిన విధంగా నిద్రపోవటం మంచిది.మీకు గ్రహణం గురించి ఏమైనా భయాలు ఉన్నట్టయితే మీ వైద్యులను సంప్రదించి ధైర్యం తెచ్చుకోండి. వైద్యులు కూడా గ్రహణానికి మొర్రికి ఎటువంటి సంబంధం లేదు అనే చెపుతారు. ఆరోగ్యంగా ఉన్న గర్భం సాధారణంగా 40 వారాల పాటు ఉంటుంది.కానీ డెలివరీ మాత్రం అకాలంగా అనగా 37 వారాల ముందే జరిగినప్పుడు దానినే ప్రీటర్న్ బర్త్ అని అంటారు.

ఈ జననం అనేది సాధారణ కార్యక్రమం కిందకు రానే రాదు.నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు తరచుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.మరి 24,28 వారాల మధ్య పుట్టినట్లయితే ఆ పిల్లలకు సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.. గర్భం దాల్చిన 28 వారాల తరువాత పుట్టిన శిశువులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. ఎందుకు అంటే వారి గుండె,మెదడు,

ఊపిరితిత్తులు వివిధ అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి.ఈ పిల్లలు దీర్ఘకాలిక అభివృద్ధి సమస్యలను ఎదుర్కోవాలి. అంతేకాక వారిలో మరణాల రేటు కూడా ఎంతో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం చూసినట్టయితే భారత దేశంలో నమోదైన శిశువు మరణాల రేటులో ఎక్కువగా నెలలు నిండని పిల్లలే. ముందస్తు జనన అవకాశాలను పెంచడానికి ఎన్నో అంశాలు కూడా ఉన్నాయి.

వీటిలో ప్రస్తుత,గత,గర్భధారణ సమస్యలు,అంటు వ్యాధులు, అధిక రక్తపోటు,గర్భాశయం సమస్యలు లేక మధుమేహం, ప్రమాదాలు లేక గాయం జీవన శైలి లాంటివి వీటిలోకి వస్తాయి. నెలలు నిండని పిల్లలు ఎదుర్కొనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు  పూర్తి వివరాలు తెలుసుకుందాం. అకాల జననం రెటీనాలోని రక్తనాళాలను ప్రభావితం చేసే రెటినోపతి ఆఫ్ ఫ్రీ మెచ్యూరిటీ అనే పరిస్థితులకు కూడా దారి తీయవచ్చు.

66 -4

దీనికి సరైన చికిత్స చేయనట్లయితే ఇది తాత్కాలికంగా లేక పూర్తిగా చూపులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ పిల్లలు రెటీనా డిటాచ్ మెంట్  అని పిలిచే  పరిస్థితి కలిగి ఉంటారు. ఈ పరిస్థితుల్లో రెటీనా కంటి  వెనుక నుంచి వేరు చేయబడి, ఆ స్పష్టమైన వక్రీకరించిన దృష్టికి కారణం అవుతుంది. అభివృద్ధి చెందని అంతర్గత చెవి నిర్మాణాల కారణం వలన వినికిడి లోపం వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇది భాష అభివృద్ధి,ఆలస్యం, కమ్యూనికేషన్ లోని సమస్యలకు కూడా దారి తీయవచ్చు.కొంతమంది అయితే పుట్టు చెవుడుగా జీవితాంతం ఉండవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అభివృద్ధి చెందని ఊపిరితిత్తుల కారణంగా పిల్లలకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారు శ్వాస తీసుకునేందుకు వెంటిలేటర్లను వాడటం అవసరం అవుతాయి.

ఈ పిల్లలు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణం వలన శ్వాస కోసం ఇన్ఫెక్షన్లకు కూడా గురవుతారు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు సెరిబ్రల్ పాల్సి ని అభివృద్ధి చేయవచ్చు. ఇది కండరాల నియంత్రణకు కదలికలకు ప్రభావితం చేస్తుంది. ఇది పుట్టకముందు లేక పుట్టిన టైం లేక కొంతకాలం తర్వాత మెదడు దెబ్బ తినటం వలన కూడా ఇది వస్తుంది.

శరీర అభివృద్ధిలో అభ్యాస వైకల్యాలు,అభిజ్ఞ లోపాలు, జాప్యాలు,అపరిపక్వ మెదడు అభివృద్ధి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు గుండె జబ్బులు, నరాలు,జీర్ణశయంత్ర సమస్యలు,ఆస్తమా లాంటి ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిల్లలు పుట్టినప్పుడు వారికి సంబంధించిన అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?