WhatsApp banned : మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిందా.? అయితే ఇలా రికవరీ చేసుకోండి..!!
అయితే ఇంతకుముందుల వాట్సాప్ ని ఎలా పడితే అలా వాడకూడదని చెప్తున్నారు. ఏవి పడితే అవి అసలు పంపడం లాంటివి చేయకూడదు. వాట్సాప్ ప్రైవసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. లేకపోతే వారు అకౌంట్లో వాట్సాప్ బ్యాండ్ చేస్తుంది. ఇప్పటికే భారత దేశంలో ప్రతి నెల మిలియన్ల కొద్ది ఆకౌంట్లు నిషేధానికి గురవుతూ ఉంటున్నాయి.

అయితే కొన్ని సమయాలలో కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వారి ఆకౌంటు బ్యాన్ అవుతుంది. అయితే ఈ బ్యాన్ ఎలా తొలగించుకోవాలి అనే దానికంటే ముందు ఎందుకు బ్యాన్ అయిందో అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి..
ఎన్ని రకాల బ్యాన్ లు ఉంటాయి.?
వాట్సప్ బ్యాన్ లలో మొదటిది తాత్కాలిక బ్యాన్.. ఎవరైతే యూసర్లను మోసం చేయడానికి వాట్సాప్ నకిలీ వర్షన్ వినియోగిస్తే.. వారు తాత్కాలికంగా నిషేదింపబడవచ్చు.
ఈ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ఈజీ అవుతుంది. ఇక రెండవది పర్మినెంట్ నిషేధం. ఒక్కసారి ఇలా బ్యాన్ అయితే మీ వాట్సాప్ అకౌంట్ ను అస్సలు వినియోగించలేరు.. సహజంగా నకిలీ కార్యకలాపాలు సైబర్ మోసం వంటివి చేస్తే పర్మినెంట్గా నిషేధం అయ్యే అవకాశాలు ఉంటాయి..

అసలు ఎందుకు నిషేధింపబడతారు.?
*మీ నెంబర్ మల్టీ యూజర్లు వాడుతుంటే మీ అకౌంటు నిషేదింపబడుతుంది.
*యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం, దుర్గినియోగం చేయడం వలన ఆకౌంటు బ్యాన్ అవుతుంది.
*అనవసరమైన ప్రకటనలు ఫేక్ పేర్లతో యూజర్లకు మెసేజ్లు పంపడం వలన కూడా మీ ఆకౌంటు నిషేదింపబడుతుంది. *వాట్సాప్ లో ఫేక్ లింక్స్ పంపి మోసం చేస్తే..
*అనధికారిక యాప్ లను వినియోగించడం వలన వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు..
బ్యాన్ ఎలా రికవర్ చేసుకోవాలి:
మీ అకౌంట్ తాత్కాలిక బ్యాంకు గురైతే వాట్సాప్ కు లాగిన్ అవ్వండి. పర్మినెంట్ నిషేధం అయితే వాట్సాప్ కి వెళ్లి కాంటాక్ట్ సపోర్ట్ లేదా "రివ్యూ రివ్యూ" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మిమ్మల్ని ఎందుకు అన్ బ్లాక్ చేయాలో మెసేజ్ టైప్ చేయండి. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే స్క్రీన్ షాట్లను అప్లోడ్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీరు నిషేధం నుంచి బయటపడతారు..
