CSK vs KKR IPL 2024 : KKR వరుస విజయాలకు బ్రేక్ వేసిన CSK...చెపాక్ వేదికగా ఘన విజయం...
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన CSK బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ కు దిగిన KKR నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక KKR బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో 34 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే సునీల్ నరేన్ 20 బంతులలో 27 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

ఇక CSK బౌలర్ల విషయానికొస్తే... రవీంద్ర జడేజా , తుషార్ దేశ్ పాండే చెరో మూడు వికెట్లు తీసుకోగా , ముస్తఫిజర్ రెహ్మాన్ 2 వికెట్లు , తీక్షణ 1 వికెట్ పడగొట్టారు. CSK బౌలర్ల ధాటికి KKR నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి స్వల్ప స్కోరు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతిరాజ్ గైక్వాడ్ అద్భుతమైన ప్రదర్శనతో 58 బంతుల్లో 9 బౌండరీలను సాధించి 67 పరుగులతో చివరి వరకు బరిలో నిలబడ్డాడు. అలాగే శివమ్ దుబే వరుస సిక్స్ లతో సంచలన సృష్టించాడు. ఈ క్రమంలోనే దూబే 18 బంతుల్లో 3 సిక్స్ లు 1 ఫోర్ తో 28 పరుగులు చేశాడు.

అదేవిధంగా డారిల్ మిచేల్ కూడా 25 పరుగులు సాధించి ఆట్టుకున్నాడు. ఇక KKR బౌలర్ల విషయానికి వస్తే... వైభవ్ ఆరోరా 2 వికెట్లు తీసుకోగా, సునీల్ నరేన్ ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకు వరుస విజయాలతో దూసుకువస్తున్న KKR ఓటమి చవి చూసింది.
