MI Vs CSK IPL 2024 : రోహిత్ శతకం వృధా.. మెరుపులు మెరూపించిన ధోని...వాంఖాడే వేదికగా CSK ఘనవిజయం..
తొలిత బ్యాటింగ్ చేసిన చెన్నై...
ఇక ఆఖరి 4 బాల్స్ మిగిలి ఉండగా బరిలో దిగిన ధోని మెరుపులు మెరూపించాడు. ఈ నేపథ్యంలోనే ధోని కేవలం 4 బంతుల్లో 3 సిక్స్ లతో 20 పరుగులు సాధించాడు. ధోని సిక్సులతో వాంఖాడే మార్మోగిందని చెప్పాలి. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హోమ్ గ్రౌండ్ వేదికగా ముంబైకి ఓటమి తప్పలేదు.
సిక్సులతో చెలరేగిన ధోని, దుబే ,గైక్వాడ్...
టాస్ వోడి బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన చెన్నైకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన అజీంక రహానే 8 బంతుల్లో ఒక ఫోర్ 5 పరుగులు చేసి రెండవ ఓవర్ లోనే ఫెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రచిన్ రవీంద్ర మరియు రుతిరాజు గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 21 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర కూడా అవుట్ అయ్యాడు.
అనంతరం బరిలో దిగిన శవమ్ దుబే సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రుతిరాజ్ గైక్వాడ్ 33 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకోగా, శివమ్ దుబే 28 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తిచేసుకుని జట్టుకు భారీ స్కోర్ అందించారు. 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్ లతో 69 పరుగులు చేసిన రుతీరాజ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
చివరి వరకు బరిలో నిలబడ్డ శివమ్ దుబాయ్ 38 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్ లతో 66 పరుగులు చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత దిగిన డైరిల్ మిచెల్ 14 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో 4 బంతులు మిగిలి ఉండగా బరిలో దిగిన మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మెరిపించాడు.
కేవలం 4 బంతుల్లో 3 సిక్స్ లు 2 పరుగులతో 20 పరుగులు సాధించి జట్టుకు ఆఖరి నిమిషంలో భారీ స్కోర్ అందించాడు. దీంతో నిర్దేశిత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు సాధించింది.

రోహిత్ శతకం వృధా...
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ మొదట్లో మంచి ఆరంభం ఇచ్చారు. ఓపినర్లుగా దిగిన ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మ పార్ట్నర్ షిప్ లో జట్టుకు 70 పరుగులు జోడించారు. పతిరాణ రాకతో ముంబై బ్యాటర్ల బలం దెబ్బతింది అని చెప్పాలి. ఒకే ఓవర్లో ఏకంగా 2 వికెట్లు తీసిన పతిరాణ ముంబై పతనాన్ని శాసించాడు.
ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ సున్నా పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. అలాగే తిలక్ వర్మ 31 పరుగులతో సరిపెట్టుకోగా హార్దిక్ పాండ్యా మరోసారి విఫలమయ్యారు. వరుసగా ముంబై బ్యాటర్స్ ఔట్ అవడంతో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేయక తప్పలేదు. ఈ క్రమంలోని 63 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్ లతో అజేయ శతకం సాధించిన హిట్ మాన్ రోహిత్ కు ముంబై నుంచి మద్దతుగా ఒక బ్యాటర్ కూడా నిలవలేదు.
దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై హోమ్ గ్రౌండ్ వేదికగా చెన్నై 20 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.
