Gautam Gambhir: ధోని స్థాయి వేరు...ఆ స్థాయిని ఎవరు అందుకోలేరు...గౌతమ్ గంభీర్...
భారత జట్టుకు కెప్టెన్ గా ధోని సాధించిన విజయాలను మరెవరు సాధించలేరని ఆ విజయాలను సాధించడం ఎవరికీ సాధ్యం కాదని తెలియజేశాడు.ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ గా ఎవరు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల ముందు అన్ని దిగదుడుపేనని గంభీర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కేకేఆర్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్ సీ.ఎస్.కే తో పోరును ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని తెలియజేశారు. ఒకప్పుడు కే.కే.ఆర్ కెప్టెన్ గా ఇప్పుడు మెంటార్ గా ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సీ.ఎస్.కే పై ఖచ్చితంగా పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలిపారు.
ధోని స్థాయి వేరు...ఆ స్థాయిని ఎవరు అందుకోలేరు...
దీనిలో భాగంగానే ధోని గురించి గంభీర్ ప్రస్తావిస్తూ....నేను ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నానను. నేనే కాదు నా స్థానంలో ధోని ఉన్న ఇలాగే ఆలోచిస్తారంటూ గంభీర్ తెలిపారు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవ మర్యాదలు ఉన్నాయని , అంతమాత్రాన పోటీ పడడంలో తగ్గకూడదు కదా..! అంటూ గౌతమ్ పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ టీమిండియా కెప్టెన్ గా ధోని సాధించిన విజయాలను మరెవరు సాధించలేరు అనేది నిజం గంబీర్ చెప్పుకొచ్చారు. టీమిండియా కెప్టెన్ గా ధోని మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదని... భారత్ కెప్టెన్స్ విదేశాల్లో ఎన్ని చారిత్రక విజయాలు సాధించినప్పటికీ , ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీలకంటే అవేమీ పెద్దవి కాదంటూ గంభీర్ ధోని యొక్క నాయకత్వ నైపుణ్యాలను ప్రశంసించారు.
అయితే ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ (2007) , అలాగే వండే ప్రపంచ కప్ 2011 వచ్చాయి. ఇక ఈ భారత జట్టులో గంభీర్ కూడా సభ్యుడుగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు గంభీర్ పొట్టి ఫార్మేట్ ఫైనల్స్ లో 75 , వన్డే ఫార్మేట్ ఫైనల్ లో 97 పరుగులు చేసి భారత్ కు ట్రోఫీలను గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఇదివరకు ఎప్పుడూ చూసినా ధోనిని ఏదో రకంగా విమర్శిస్తూ ఉండే కేకేఆర్ మెంటార్ గంభీర్ ఈసారి ధోనీ పై ప్రశంసల వర్షం కురిపించడం విశేషంగా మారింది. కాగా కేకేఆర్ కు గంభీర్ సారిదిగా ఉన్నప్పుడు సీ.ఎస్.కే తో 11 సార్లు పోటీపడి కేవలం 5 సార్లు మాత్రమే గంభీర్ విజయం సాధించాడు. అలాగే 2012 ఫైనల్ లో సీ.ఎస్.కే ని ఓడించి గంభీర్ కేకేఆర్ కు టైటిల్ ని కూడా అందించాడు.
ఈరోజు మ్యాచ్...
ఇది ఇలా ఉంటే చెన్నై వేదికగా ఈరోజు జరగబోయే CSK vs KKR మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్లలో వరుసగా 3 విజయాలు నమోదు చేసుకుని కేకేఆర్ పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉండగా, ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు విజయాలు అందుకొని హోమ్ గ్రౌండ్ వేదికగా ఈరోజు ఎలాగైనా విజయం సాధించాలని కసితో చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోంది. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
