IPL 2024 : ధోని కోసం 64 వేలు ఖర్చు చేసి స్టేడియం కు వచ్చిన వీరాభిమాని..
కేవలం అతన్ని , అతని ఆటను చూసేందుకే అభిమానులు స్టేడియంకి క్యూ కడతారు.మరీ ముఖ్యంగా భారతదేశంలో జరిగే ఐపీఎల్ సిరీస్ లో ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ స్టేడియం కి వెళ్ళినా సరే ఆ స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీతో నిండిపోవడం ఖాయం. ఇదంతా కేవలం ధోని వలనే సాధ్యమనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ విషయాన్ని మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ధోనిని చూసేందుకు కూతుర్ల చదువుల కోసం దాచిన డబ్బులు వృధా చేసిన ఆ వ్యక్తి విమర్శల పాలవుతున్నాడు...పూర్తి వివరాల్లోకి వెళ్తే...
సాధారణంగానే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లో ధోని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు వస్తుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉందంటే చాలు...ఏ మైదానమైన సరే దాదాపుగా పసుపు రంగు తోనేే నిండిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధోని కోసమే గ్రౌండ్ కి వస్తారు .అదేవిధంగా తమిళనాడుకు చెందిన వీర అభిమానులు కూడా ధోనీ కోసం మైదానాలకు వస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ధోని వీరాభిమాని ఏకంగా 64 వేలు వెచ్చించి ధోనిని చూసేందుకు తన ముగ్గురు కూతుర్లతో కలిసి గ్రౌండ్ కి వచ్చాడట. చెన్నై లో మ్యాచ్ ఉన్నప్పుడు అతనికి టికెట్లు దొరకకపోవడంతో... బ్లాక్ లో ఆ టికెట్స్ ను 64 వేలు పెట్టి కొనుగోలు చేశాడట. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత అతను చెప్పిన అసలు నిజం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని వారి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బుల తో ధోనిని ఒక్కసారైనా చూడాలనే ఉద్దేశంతో 64 వేలు పెట్టి బ్లాక్ లో టికెట్లు కొని తన ముగ్గురు పిల్లలతో స్టేడియం కు వచ్చినట్లుగా తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ధోని పై అతనికి ఉన్న అభిమానాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు
కానీ అతను చేసిన పని చూసి చాలామంది తిట్టుకుంటున్నారు. అభిమానం ఉండాలి కానీ మరీ ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదని అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. క్రికెటర్స్ అయిన సరే మొదట వారి యొక్క వ్యక్తిగత విషయాలకే ప్రాథన్యత ఇస్తారని అలాంటిది కూతుళ్ళ ఫీజు కు డబ్బులు లేనప్పుడు 64 వేలు ఖర్చు పెట్టి బ్లాక్ లో టికెట్ కొనాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
