Mi Vs RCB : వాంఖాడే వేదికగా ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్...

Mi Vs RCB : వాంఖాడే వేదికగా ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్...

Mi Vs RCB : ఐపీఎల్ 2024 లో భాగంగా ఇటీవల ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు ఆర్సిబీకి మధ్య జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. హోమ్ గ్రౌండ్ వేదికగా 7 వికెట్లు తేడాతో విజయకేతనాని ఎగురవేసి సత్తా చాటింది.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా, తొలిత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 197 లక్ష్యాన్ని  3 వికెట్లు నష్టపోయి కేవలం 15.3 ఓవర్లలోనే ముగించింది. దీంతో వాంఖాడే వేదికగా ముంబై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

12 -2

ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్స్ ఫాఫ్ డూప్లెస్ 40 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్స్ లతో 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా అతనితో పాటు రజాట్ పట్టిదర్ 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టగా దినేష్ కార్తీక్ 5 బౌండరీలు 4 సిక్స్ లతో 53 పరుగులు చేసి చివరిదాకా బరిలో నిలబడ్డారు. దీంతో RCB నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగలిగింది.

జస్ప్రీత్ బూమ్రా మెరుపులు...

ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. అతనితోపాటు జరల్డ్ కెట్ జీ 1 , శ్రేయస్ గోపాల్ 1 , ఆకాశ్ మద్వాల్  1 వికెట్ తీసుకున్నారు.

సత్తా చాటిన ముంబై బ్యాటర్లు...

12 -3

అనంతరం167 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ సునామి సృష్టించారు. ప్రతి బంతిని బౌండరీకు తరలిస్తూ RCB బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7ఫోర్లు 5 సిక్స్ లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా , రోహిత్ శర్మ 38 , సూర్య కుమార్ యాదవ్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్దేశిత లక్ష్యాన్ని కేవలం 15.3 బంతులలో చేదించి హోమ్ గ్రౌండ్ వేదికగా ఘనవిజయం సాధించింది.

RCB బౌలర్ల విషయానికొస్తే.. 

ఆకాశ్ దీపు 1 ,వైషక్ విజయ్ కుమార్ 1 , విల్ జాక్స్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో  పాయింట్ల పట్టికలో ఆర్సిబి 9వ స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి చేరుకుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?