PBKS vs RR, IPL 2024: రఫ్పాడించిన రాజస్థాన్ రాయల్స్.. పోరాడి ఓడిన పంజాబ్..
అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోగా , హోమ్ గ్రౌండ్ వేదిక తోలుత బ్యాటింగ్ లు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్దేశిత 20వ ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.అనంతరం బరిలో దిగిన రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలోనే చేదించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
వెలవెలబోయిన పంజాబ్ బ్యాటర్స్..
ఇక రాజస్థాన్ రాయల్ బౌలర్ల విషయానికొస్తే...ఆవిష్ ఖాన్ 2 , కేశవ్ మహారాజు 2 వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్ట్ 1 , కుల్ దీప్ సెన్ 1 ,చాహల్ 1 వికెట్ పడగొట్టారు.
రఫ్పాడించిన రాజస్థాన్ బ్యాటర్స్...
అనంతరం 148 స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28 బంతుల్లో 4బౌండరీలు సాధించి 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతనితోపాటు తనుష్ కోటియన్ 24 , సంజు శంసన్14 బంతుల్లో 18 పరుగులు సాధించారు.

రియాన్ పరాగ్ 18 బంతులలో 23 పరుగులు అందించి పెవిలియన్ బాట పట్టగా చివర్లో వచ్చిన హిట్ మేయర్ జట్టుకు భారీ స్కోర్ అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే హిట్ మేయర్ కేవలం 10 బంతుల్లో 1 బౌండరీ 3 సిక్సలతో 27 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశిత లక్ష్యాన్ని కేవలం 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఛేదించింది.
ఇక పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే...
రబాడ 2 వికెట్లు , సామ్ కరణ్ 2 వికెట్లు పడగొట్టగా , అర్షదీప్ సింగ్ , లివింగ్ స్టన్ , హర్షల్ పటేల్ తల ఒక వికెట్ పడగొట్టారు. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ 8వ స్థానానికి పరిమితమైంది.
