RCB Vs GT IPL 2024 : హ్యాట్రిక్ విజయం అందుకున్న బెంగళూరు...గుజరాత్ పై ఘనవిజయం...

RCB Vs GT IPL 2024 : హ్యాట్రిక్ విజయం అందుకున్న బెంగళూరు...గుజరాత్ పై ఘనవిజయం...

RCB Vs GT IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ పై ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ లక్ష్యాన్ని సనాయాసంగా ఛేదించి ఘనవిజయం అందుకుంది.

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

ఈ క్రమంలోనే ఆర్సీబీ 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేదించింది. దీంతో వరుస విజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకోగలిగింది. మరోవైపు గుజరాత్ సంక్లిష్టమైన మ్యాచ్ లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయని చెప్పాలి. గుజరాత్

ఇన్నింగ్స్...

ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన గుజరాత్ పరుగులు చేయడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే ఓపినర్స్ శుబ్ మన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహ స్వల్ప స్కోర్ చేసి పెవిలియన్ చేరారు. గిల్ 7 బంతులలో 2 పరుగులు చేయగా , వృద్ధిమాన్ సాహ 7 బంతుల్లో ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు.

05 -1

అనంతరం బరిలో దిగిన ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో గుజరాత్ తీవ్ర కష్టాల్లో మునిగిపోయింది. ఇక తర్వాత వచ్చిన  డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 3 ఫోర్లు ,2 సిక్స్ లతో  30 పరుగులు చేయగలిగాడు. అతనితో పాటు తేవాటియా 21 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్ తో 35 పరుగులు సాధించాడు.

ఆ తర్వాత రషీద్ ఖాన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరగా , విజయశంకర్ 10 పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన  గుజరాత్ బ్యాటర్స్ అందరూ విఫలం అవడంతో గుజరాత్ 19.3 ఓవర్ లో 147 పరుగులు మాత్రమే సాధించి  ఆల్ అవుట్ అయింది.

ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు ,యాష్ దయాల్ 2 వికెట్లు ,వైశక్ విజయ్ కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే కర్ణ శర్మ 1 ,కామెరాన్ గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.

బెంగళూరు ఇన్నింగ్స్...

148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు గుజరాత్ అందించిన లక్ష్యాన్ని సునాయాసంగా చేదించి ఘనవిజయం సాధించింది. ఇక ఈ లక్ష చేధనలో ఆర్సీబీ మాజీ కెప్టెన్స్ ఫాఫ్ డుప్లేస్సిస్ , విరాట్ కోహ్లీ గట్టి ఆరంభాన్ని అందించారు. ఇక వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భాగస్వామ్యంలో 92 పరుగులు నెలకొల్పారు.

05 -3

ఈ క్రమంలోనే ఫాఫ్ డూప్లిసెస్ 23 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్ లతో 64 పరుగులు చేయగా , విరాట్ కోహ్లీ 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన ఆర్సీబీ బ్యాటర్స్ స్వల్ప పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఆర్సీబీ 125 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది.  ఆ తర్వాత గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన దినేష్ కార్తీక్ మరియు స్వప్నిల్ సింగ్ ఆర్సీబీని విజయ తీరాలకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయుడుగా నిలవగా , స్వప్నిల్ సింగ్ 15 పరుగులు సాధించి ఆర్సీబీ కి ఘనవిజయం అందించారు. దీంతో బెంగళూరు 148 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి కేవలం 13 ఓవర్లలోనే ముగించింది. ఇక గుజరాత్ బౌలర్సు జాషువా లిటిల్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా , నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నాడు.

 

 

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?