RR Vs KKR IPL 2024 : శతకంతో చెలరేగిన జోష్ బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ ఘనవిజయం..
రాజస్థాన్ లోని మిగతా బ్యాటర్స్ మద్దతు ఇవ్వకపోయినా చివరివరకు బరిలో నిలబడి తన జట్టును గెలిపించుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన కోల్‌కతా మంచి ఆటను కనబరిచింది. ఈ క్రమంలోని పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా ఒక వికెట్ నష్టపోయి 56 పరుగులు సాధించింది. ఇదే సమయంలో సిక్సర్లతో చెలరేగిన నరేన్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దీంతో 10 ఓవర్లకు కోల్‌కతా 100 పరుగులు పూర్తి చేసుకోగా అదే సమయానికి కోల్‌కతా రెండు వికెట్ కూడా కోల్పోయింది. అనంతరం రఘు వంశీ 18 బంతులలో 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 11 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.
ఈ విధంగా కోల్‌కతా బ్యాటర్లు వరుసగా అవుట్ అవుతుంటే సునీల్ నరేన్ బరిలో నిలబడి 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్స్ లతో 119 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక చివర్లో బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన రింకూ సింగ్ 20 పరుగులు సాధించడంతో నిర్దేశిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా 223 పరుగులు సాధించింది.
లక్ష్య చేధనలో బట్లర్ పై చేయి...
అనంతరం 224 భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ కు రెండవ ఓవర్ లోనే షాక్ తగిలింది. 9 బంతుల్లో 19 పరుగులు చేసిన రాజస్థాన్ ఓపెనర్ జైశ్వాల్ రెండవ ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్ కూడా 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.

అనంతరం బరిలో అడుగుపెట్టిన రియాన్ పరాగ్ 14 బంతుల్లో నాలుగు ఫ్లోర్లు 2 సిక్స్ లతో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ ,రవిచంద్రన్ అశ్విన్ ,హిట్ మేయర్ వరుసగా పెవిలియన్ కు చేరారు. దీంతో 125 పరుగులకే రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది.
ఇక రాజస్థాన్ కి ఓటమి ఖాయం అని అందరూ అనుకుంటున్న వెళ బరిలో దిగిన జోస్ బట్లర్ ఒంటి చేత్తో పోరాడి వీరోచక శతకంతో రాజస్థాన్ కు ఘనవిజయం అందించాడు. 60 బంతులలో 9 ఫోర్లు 6 సిక్స్ లతో 107 పరుగులు సాధించిన బట్లర్ రాజస్థాన్ కు ఘన విజయం అందించాడు.
