RCB vs SRH, IPL 2024 : చిన్న స్వామి స్టేడియం వేదికగా SRH సరికొత్త రికార్డు... ఆర్‌సీబీపై 287 పరుగులు
ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దిష్ట 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 288 భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు నిర్దిష్ట 20 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలిపోయింది.
చిన్న స్వామి స్టేడియంను శాసించిన హైదరాబాద్ బ్యాటర్లు....

దీంతో బెంగళూరు బౌలింగ్ లో మార్పులు చేర్పులు చేపట్టినప్పటికీీ ప్రయోజనం రాలేదు. ఈ నేపథ్యంలోనే 41 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్స్ లతో హెడ్ 102 పరుగులు చేశాడు. అతనితోపాటు క్లాసన్ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్స్ లతో 67 పరుగులు చేశాడు.
అదేవిధంగా మార్కమ్ 17 బంతులో 2 ఫోర్లు 2 సిక్స్ లతో 32 పరుగులు చేయగా , అబ్దుల్ సమాద్ కేవలం 16 బంతులలో 4 ఫోర్లు 3 సిక్స్ లతో 37 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది.
పోరాడి ఓడిన బెంగళూరు..
హోమ్ గ్రౌండ్ వేదికగా 288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు మొదట మంచి ఆరంభమే లభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ మరియు పాఫ్ డూప్లిసిస్ 6 ఓవర్లలోనే జట్టుకు 80 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరు ఈసారి ఏదో అద్భుతం చేస్తుంది అనుకునే లోపు హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు బ్యాటర్లకు అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే కింగ్ కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేసి పేవిలియన్ బాట పట్టాడు . అనంతరం 28 బంతుల్లో 62 పరుగులు చేసిన డూప్లిసిస్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ వరుసగా ఔట్ కాగా , ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు నుండి మంచి ఫామ్ లో కనిపిస్తున్న దినేష్ కార్తీక్ అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు.
దీంతో బెంగుళూరు జట్టు హోమ్ గ్రౌండ్ వేదికగా నిర్దేశిత 20 ఓవర్లలో 262 పరుగులకే పడిపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
