Virat Kohli Wax Statue : విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. మైనపు విగ్రహం ఏర్పాటు..
ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును లీడ్ చేస్తున్న విరాట్ కోహ్లీకి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో వ్యాక్స్ మ్యూజియం ఉన్న విషయం తెలుసు కదా. చాలామందికి మేడమ్ తుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం తెలిసే ఉంటుంది.

Virat Kohli Wax Statue : కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయడానికి రెండు నెలలు
కోహ్లీ విగ్రహం బరువు 35 కిలోలు ఉంటుంది. ఈ విగ్రహాన్ని రెండు నెలలు కష్టపడి తయారు చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే పలువురు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, ధోనీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

తాజాగా కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి కోహ్లీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయాలని పలువురు పర్యాటకుల నుంచి డిమాండ్లు రావడంతో ఈ సంవత్సరం ఏర్పాటు చేశామని అనూప్ వెల్లడించారు.
ఇండియాలో చాలామంది ప్రముఖులు ఉన్నా కూడా ఎక్కువ మంది పిల్లలు, యూత్.. కోహ్లీ విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ మ్యూజియం జైపూర్ లోని నహార్ ఘర్ ఫోర్ట్ సమీపంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మ్యూజియంలో 44 వ్యాక్స్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ విగ్రహంతో కలిపి 45 విగ్రహాలు అయ్యాయి.
