నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 17 (క్విక్ టుడే) : క్రికెట్ ప్లేయర్ గా తనకు ఆ టలంటే ఎంతో ఇష్టమని, జిల్లాలో టేబుల్ టెన్నిస్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని టేబుల్ టెన్నిస్ నూతన అధ్యక్షుడు, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా టెబుల్ టెన్నిస్ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనంలో ఎన్నుకున్నారు. 2024 నుండి 2029 వరకు 4 సం||ల పాటు ను కొనసాగే టేబుల్ టెన్నిస్ కార్యవర్గ జిల్లా అధ్యక్షులుగా - నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీగా K.V.S ఆనంద్ బాబా, ట్రెజరర్ గా ఎల్.సత్తి రెడ్డి, ఉపాధ్యక్షులుగా సయ్యద్ జాఫర్, నర్సింహా రెడ్డి, ఎన్.వెంకటయ్య, భరత్, జాయింట్ సెక్రటరీ లుగా ఘురాం, ఎం.కిరణ్ కుమార్, డి.రవిశంకర్, ఎ.శ్రీదేవి, జి. శ్రీదేవిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం. విజయ, బి. శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, గురు, వీరయ్య, సురేశ్, సీహెచ్ సోనియా, పి. కృష్ణవేణి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రమేష్ గౌడ్ ను శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యవర్గ ఎన్నిక డీఎస్ఏ అబ్జర్వల్ గా మహ్మద్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.