మేడ్చల్ జిల్లాలో 28,75,907 మంది ఓటర్లు
సవరించిన ఓటర్ల జాబితా విడుదల చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
On
మేడ్చల్ కలెక్టరేట్, క్విక్ టుడే ప్రతినిధి : గురు వారం జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డి. ఆర్. ఓ. హరిప్రియ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం నమోదులు, తొలగింపుల అనంతరం జిల్లాలో సవరించిన ఓటర్ల జాబితా విడుదల చేశారు. జిల్లాలో 28,75,907 మంది ఓటర్లుగా నమోదయ్యారని అదనపు కలెక్టర్ తెలిపారు. 10,264 మంది యువత కొత్తగా ఓటర్ జాబితాలో చేరినట్లు తెలిపారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 715 మంది, దివ్యంగులు 26.207, పురుషులు 14,83,448 మంది, స్త్రీలు 13,92,074 మంది, ట్రాన్స్ జెండర్ 385 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు.
80 సంవత్సరాల పై బడిన వయోవృద్ధులు, దివ్యంగులు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వారికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. మరణించిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించాలని పార్టీ ప్రతినిధులు కోరగా, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం తొలగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టరేటులో నిర్వహిస్తున్న ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో భాగంగా ఈవీఎం, వీవీ ఫ్యాట్, బ్యాలెట్ బాక్స్ ల పనితీరు ను అదనపు కలెక్టర్ తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...