రేషన్ షాపులో 14 రకాల సరుకులు ఇవ్వాలి

-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ సరోజ

రేషన్ షాపులో 14 రకాల సరుకులు ఇవ్వాలి


800
నల్లగొండ, ఫిబ్రవరి 8, క్విక్ టుడే(ప్ర‌తినిధి) : రేషన్ షాపులో 14 రకాల నిత్యావ‌స‌ర‌ సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ డిమాండ్ చేశారు . గురువారం మిర్యాలగూడ మండలం గూడూరు, కృష్ణాపురం, బోటియా నాయక్ తండాలో  రేషన్ షాపు  సమస్యలపై సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బియ్యం మాత్రమే ఇవ్వడం వలన జీవనం గడవడం ఇబ్బందిగా ఉందని ప్రజలు వివరించారు. కేరళ తరహాలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులను అందించాలని ఆమె కోరారు. పేదలకి రేషన్ కార్డు లేక ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని అన్నారు.  కుటుంబాలకు కొత్తగా  కార్డులు రావాల్సి ఉందని అన్నారు. బియ్యం తీసుకునే సందర్భంలో సిగ్నల్ అందక, వేలిముద్రలు పడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లుట్ల సైదులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ మహిళా కూలీల జిల్లా నాయకురాలు ఓగోటి పూలమ్మ మాజీ ఎంపీటీసీ బొగ్గరపు కృష్ణయ్య, బొగ్గరపు శ్రీను బొంగురాల వెంకయ్య, బొడ్డు సైదులు, ధరావత్ సైదా, నూకపంగా విజయ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?