విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు

విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు

మేడిప‌ల్లి, మే3 (క్విక్ టుడే న్యూస్‌):-విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) మాజీ రాష్ట్ర నాయకులు సోమరాజు పిలుపునిచ్చారు.ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎఐవైఎఫ్ మేడిపల్లి మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో యువజన సంఘ జెండాను సోమరాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు సోమరాజు, ఎఐవైఎఫ్ మేడిపల్లి మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ మన దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు.యువతరంలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) నిరంతరం కృషి సల్పుతున్నదన్నారు. దేశం కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్వాతంత్ర్యోద్యమంలో, యువకులను సమీకరించి వీరోచితమైన పోరాట జరిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఇస్తారి, ఖాదర్, పృద్వి, నాగచైతన్య, ఎషూ, అఖిలేష్, ప్రశాంత్, వంశి, దుగ్గు, సాయి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250503-WA0035

Read Also శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?