భూభారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూభారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

మాడుగులపల్లి, ఏప్రిల్ 27 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి పై రైతులకు అవగాహన సదస్సులో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్-కలెక్టర్ నారాయణ అమిత్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ భారతిలోని సెక్షన్లు వాటి వివరాలను రైతులకు వివరించారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి, ఏడాది కాలంలోనే భూభారతిని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో ధరణి వ్యవస్థ వలన ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని. రైతులకు న్యాయం జరగలేదన్నారు. ధరణి ద్వారా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు భూభారతితో అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారులు నేరుగా వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిశీలిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, ఎమ్మార్వో సురేష్, ఎంపీడీవో తిరుమల స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గడ్డం పురుషోత్తం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు, కల్లు శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, మునుగోటి యాదయ్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250427-WA0027

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?