Breaking news: ఇల్లందు, టేకులపల్లి మార్చి 21, క్విక్ టుడే : అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని తెలిసి స్థానిక మహిళలు, గ్రామస్తులు నాలుగు వైన్ షాపులపై గురువారం దాడి చేసి చేశారు. వైన్ షాపులో ఉన్న మద్యాన్ని మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం లోని ఇల్లందు, టేకులపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మద్యం షాపుల్లో పేరొందిన బ్రాండ్లు బెల్ట్ షాపులకే యజమానులు విక్రయిస్తన్నారు. ఇవి అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపు వారికే మద్యం షాపు యజమానులు విక్రయిస్తున్నారు.

ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి 30 అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో స్థానికులు ఆగ్రహించి మహిళలు, గ్రామస్తులు మూకుమ్మడిగా పట్టపగలు వైన్ షాపులపై దాడి చేసి, మద్యం స్టాక్ మొత్తం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న కొంతసేపటికి టేకులపల్లి పోలీసులు లూటీ జరిగిన షాపులను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.