మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

రూ.5 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేసిన‌ రాఘవ కంపెనీ

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

నల్లగొండ మార్చి 1 (క్విక్ టుడే) : మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుడు వేతనాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కస్పరాజు నవీన్ కుటుంబానికి రాఘవ కంపెనీ నుండి రూ.5 లక్షల చెక్కును శుక్రవారం మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రాఘవ కంపెనీ నుండి వేతనాలు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఫిబ్రవరి 23న  తిప్పర్తి మండలం  గడ్డి కొండారము గ్రామానికి చెందిన కస్పరాజు నవీన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

ఆ సందర్భంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగ కంపెనీ యాజమాన్యం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చినది. ఆ హామీ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాఘవ కంపెనీ ఇన్చార్జి మహేష్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ కస్పరాజు నరసింహ,కొమ్ము సతీష్ లు 5లక్షల రూపాయల  చెక్కును మృతుడి భార్య కస్పరాజు శివాని, తండ్రి కస్పరాజు సైదులుకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు జంజారాల జానయ్య నీలకంఠం అంజయ్య కస్పరాజు శ్రీను, శోభన్ దూదిమెట్ల అంజయ్య, జంజారాల జానయ్యా ,కస్పరాజు నవీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?