Guntakandla-Jagadish-reddy : కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో తిరగనివ్వం
13న నల్లగొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన జగదీశ్‌రెడ్డి
Guntakandla-Jagadish-reddy : నల్గొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : కృష్ణా ప్రాజెక్టు తిరిగి రాష్ట్ర పరిధిలోకి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో తిరగనియ్యమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మర్రిగూడ బైపాస్ రోడ్ లో ఈనెల 13న కృష్ణ జలాల సాధన కోసం, నల్లగొండలో నిర్వహించనున్న బి ఆర్ ఎస్ భారీ బహిరంగ సభ స్థలాన్ని నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ దద్దరిల్లేలా ఈనెల 13న సభ నిర్వహిస్తాం అని, ఈ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారు అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు దుర్భాశలాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తులు చేరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతీ అర్థం అవుతుందని అన్నారు. నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయని దుయ్య బట్టారు. 24 గంటల కరంట్ కేసీఆర్ గుర్తు, ఇవ్వాళ 24 గంటల కరంట్ మాయం అయింది అని అన్నారు. రైతు బంధు డబ్బులు కేసీఆర్ చిహ్నం.. అది ఇవ్వాళ మాయం చేశారు.. రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు... నిరంతర మంచి నీటి సరఫరా కేసీఆర్ గుర్తు.. ఇవ్వాళ నీళ్లు రావడం లేదు కేసీఆర్ గుర్తు చేరిగిపోయింది..
