Holi Festival 2024 : హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి? రంగుల ప్రత్యేకత ఏంటి?

Holi Festival 2024 : హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి? రంగుల ప్రత్యేకత ఏంటి?

Holi Festival 2024 : హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రంగులు. అవును.. అందుకే హోలీని రంగుల పండుగ అని అంటారు. హోలీ అంటేనే ఆనందకేళీ. ప్రజలు ఆరోజు ఉదయం నుంచే రంగులతో కేరింతలు కొడుతుంటారు. హోలీకి వెల్ కమ్ చెబుతుంటారు. నిజానికి హోలీ పండుగ అనేది వసంత ఆగమనం సమయంలో వస్తుంది. అంటే.. చలికాలానికి గుడ్ బై చెప్పి ఎండాకాలానికి ప్రజలు స్వాగతం పలికే సమయంలో హోలీ పండుగ వస్తుంది.

ఎండాకాలం సమయం మొత్తాన్ని వసంత కాలం అంటాం. వసంత ఋతువు కాలం వచ్చే సమయానికి గుర్తుగా కొందరు హోలీ జరుపుకుంటారు. దానికి స్వాగతం పలుకుతారు. ఒక్కోచోట ఒక్కో విధంగా హోలీ పండుగకు విశిష్టత ఉంది. హోలీ పండుగ వెనుక చాలా కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 

పురాణాల్లో హోలీ పండుగకు ఒక విశిష్టత ఉంది. హోలీకా అనే రాక్షసి అంతమైన సందర్భంగా ప్రజలంతా సంతోషంతో హోలీ పండుగను జరుపుకుంటారని ఓ కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. హోలికా అనే రాక్షసి అప్పట్లో ప్రజలను పట్టి పీడించేది. శ్రీమహా విష్ణువు భక్తుడు అయిన ప్రహ్లాదుడిని చంపేందుకు ఆ హోలికా రాక్షసి ప్రయత్నాలు చేస్తుంది.  

251 -1

Holi Festival 2024 : మంటల్లో పడి అంతమైన హోలికా రాక్షసి

ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు శివుడి భక్తుడు. కానీ.. హిరణ్యకశ్యపుడి కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు భక్తుడు. విష్ణువు అంటే పడని హిరణ్యకశ్యపుడు.. శివుడిని మాత్రమే పూజించాలని ప్రహ్లాదుడిని హెచ్చరిస్తాడు. ప్రహ్లాదుడు మాత్రం అస్సలు వినడు. తను విష్ణువునే పూజిస్తుంటాడు. 

దీంతో ప్రహ్లాదుడిని చంపే పనిని హోలికా రాక్షసికి అప్పగిస్తాడు హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపేందుకు.. హోలికా రాక్షసి ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడిని.. హోలికా రాక్షసి మంటల్లో వేస్తుంది. కానీ.. ప్రహ్లాదుడికి ఏం కాదు. శ్రీమహావిష్ణువు అతడిని కాపాడుతాడు. అదే మంటల్లో హోలికా రాక్షసి పడి అంతం అవుతుంది. 

హోలికా రాక్షసి పీడ విరగడ కావడంతో అప్పటి నుంచి ప్రజలు.. హోలి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు.. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు తపస్సు చేస్తున్న సమయంలో ఆయన తపస్సుకు ఆటంకం కలిగించాలని కామదేవుడు ప్రయత్నిస్తాడు. శివుడి మీద పూల బాణాలు ప్రయత్నిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది.

తన తపస్సుకే భగ్నం కలిగిస్తావా అని శివుడు ఆగ్రహంతో తన మూడో కన్ను తెరిచి కామదేవుడిని నాశనం చేస్తాడు. కామదేవుడి శరీరం బూడిద అవుతుంది. తన భర్తను శివుడు భస్మం చేశాడని తెలుసుకున్న కామదేవుడి భార్య రతీ దేవి.. శివుడికి ప్రార్థనలు చేస్తుంది. తన భర్తను తిరిగి బతికించాలని కోరుతుంది. దీంతో కామదేవుడిని తిరిగి బతికిస్తాడు శివుడు.

251 -2

అలా.. హోలీ ముందు రోజు కాముడి దహనం వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ పండుగను ఇప్పుడు కాదు.. సత్య యుగం నుంచి ప్రజలు జరుపుకుంటున్నారట. హోలీని హోళికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. దీన్ని డోలికోత్సవం అని కూడా పిలుస్తారు.

డోలికోత్సవం అంటే.. శ్రీకృష్ణుడు.. గోపికలతో కలిసి హోలీ పండుగను పువ్వులు, రంగులతో బృందావనంలో జరుపుకున్నాడని చెబుతుంటారు. ఎదుటివారి మీద రంగులు చల్లడం, పూలు చల్లుకోవడం వల్ల ప్రేమ, సౌభాగ్యం వెల్లివిరుస్తుందని పెద్దలు నమ్ముతారు. అందుకే హోలీ నాడు రంగులు చల్లుకుంటారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?