Jakka Venkat Reddy: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌

పీర్జాదిగూడ‌ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Jakka Venkat Reddy: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌

పీర్జాదిగూడ‌, క్విక్ టుడే : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని పీర్జాదిగూడ‌ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సేవాలాల్ బంజార వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 285వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యావత్‌ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్‌ మహారాజ్ అని అభివర్ణించారు.

బంజారాల ఆరాధ్యదైవం సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు సేవాలాల్‌ మహరాజ్‌. సాంఘిక సమానత్వం కావాలంటూ, బంజారాలు ఆర్థికంగా బలపడాలంటూ పలు బోధనలు చేశారని సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వారి ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించార‌ని పేర్కొన్నారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేయడం, ఆత్మగౌరవ ప్రతీకగా బంజారా భవన్ నిర్మించి లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేసి, బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బైటింటి శారదా ఈశ్వర్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు ఈశ్వర్ రెడ్డి, పాశం బుచ్చియాదవ్, అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?