ఎంఈఎఫ్ నూతన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు కు సన్మానం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
On
నల్లగొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17. (క్విక్ టుడే) : ఎంఈఎఫ్ నూతన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ను,ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో సంఘం అభివృద్ధికై తోడ్పడాలని కోరారు.
మందకృష్ణ మాదిగ చేపట్టిన నిరుపేద ప్రజల కోసం కృషిచేసిన ఉద్యమాలు, గుండె ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ, వితంతుల పింఛన్, వికలాంగుల హక్కులకై పోరాటం చేసిన గొప్ప నేత అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఆకాంక్షించారు. ఎం ఇ ఎఫ్ నూతన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాదిగ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, ఎంఈఎఫ్ ఉద్యోగ సంఘానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పక్షాన మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నడుచుకుంటానన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
