MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
ఈడీ జాయింట్ డైరెక్టరేట్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది బృందం ఢిల్లీ బృందం శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న కవిత నివాసంలో సోదాలు కొనసాగించింది. అక్కడే ఉన్న కవిత భర్త అనిల్ కుమార్‌తో పాటు మిగతావారి సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే వారిని ఈడీ అధికారులు గేటు వద్దే అడ్డుకోవడంతో కార్యకర్తలు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసు బందోబస్తు పెంచారు. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చినప్పడు ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకుని. త్వరగా వస్తానని ఓదార్చింది.
అక్కడే ఆం దోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించి అభివాదం తెలిపింది. ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆమెను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. రాత్రి 9 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. శనివారం ఆమెను కోర్టులో హాజరు పర్చనున్నారు.
