MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్ డేట్.. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ అధికారులు
జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించనున్నారు. జైలులోకి లాప్ టాప్ తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను విచారించేటప్పుడు మాత్రం ఆమె స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. వచ్చే వారం కవితను సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే.. కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు కవిత ఇచ్చిన రూ.100 కోట్లపైనే సీబీఐ అధికారులు కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
MLC Kavitha : 2022 లోనే కవితకు సీబీఐ నోటీసులునిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని 2022 డిసెంబర్ లో కవితను సీబీఐ నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తనను విచారించిన అనంతరం.. కవితను తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు.

అయితే.. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఓవైపు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది పెద్ద తిమింగలాలనే గాలాలతో లాగేశారు అధికారులు. ఈడీ అధికారులతో పాటు సీబీఐ అధికారులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కేజ్రీవాల్ ను కూడా తీహార్ జైలులోనే కస్టడీలో ఉంచారు. జైలు నెంబర్ 2 గదిలో ఆయన ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా అదే జైలులో కస్టడీలో ఉన్నారు.దాదాపుగా ఆప్ నేతలంతా జైలులోనే ఉన్నారు. సీఎం కూడా జైలులోనే ఉండటంతో... పాలనను జైలు నుంచే చేస్తామని ఆప్ ప్రకటించింది. జైలు నుంచే సీఎం పాలన చేస్తారని ఆప్ స్పష్టం చేసింది.
జైలులోనే పలు ఫైళ్లపై అరవింద్ సంతకం పెడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్ లోనూ జైలు నుంచే సీఎం హాజరు అవుతున్నారు. మరోవైపు ఆప్ పార్టీకే చెందిన మరో ఇద్దరు మంత్రులను కూడా ఈడీ విచారిస్తోంది. అంటే.. త్వరలోనే వాళ్లు కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
