Nalgonda : నల్ల చట్టాలతో మోడీ దగా
దేశ ఆర్థిక స్వావలంబనకే ముప్పు
Nalgonda : మోడీ గద్ద దిగాలని కార్మిక నేతల డిమాండ్
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
నల్లగొండ. ఫిబ్రవరి 16.( క్విక్ టుడే)
కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల రద్దు చేసి హక్కులు కాలరాస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సిఐటియు, ఐ ఎన్ టి యు సి, ఏ ఐ టి యు సి ,ఐ ఎఫ్ టి యు, బి ఆర్ టి యు, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులతో పెదగడియారం దగ్గర నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐ ఎన్ టి యూ సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న లు మాట్లాడుతూ బిజెపి మోడీ కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా నూతన చట్టాలను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చడానికి తీవ్ర కుట్రలు చేస్తున్నారని అన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను 100% వాటాలు కార్పొరేట్లకు తెగ నమ్ముతున్నారని దేశంలో కోట్లాది ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భారతదేశం వెలిగిపోతుంది అచ్చేదిన్ హాయిగా విశ్వగురు మేకిన్ ఇండియా ఆత్మనిర్బల్ భారత్ పేర్లతో మోసపూరిత నినాదాలు ఇచ్చి ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకు చేస్తున్నారని వారు ఆరోపించారు కార్మికుల పనిగంటలు ఎనిమిది గంటల నుండి 12 గంటలకు పెంచుతూ కార్మికులకు కనీస వేతనాలు పెన్షన్ పెంచకుండా మరో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు ప్రధాని మోడీ నల్ల చట్టాలతో దేశంలోని కార్మికులను రైతులను మోసం చేస్తున్నారని ఢిల్లీ రాజధాని లో రైతులు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేయకుండా ఢిల్లీ లోకి ప్రవేశించకుండా పోలీసుల తోటి నేటి ఫిరంగులు భాష గోళాలు రోడ్లపై ఇనుప మేకులు భారీ కేడ్లు సిమెంటు గోడలు పెట్టి రహదారులను మూసి వేశారని అయినప్పటికీ వేలాది మంది రైతులు కార్మికులు రాజధానిలోకి ప్రవేశించారని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసి కార్మికులు రైతులు తలపెట్టిన జాతీయ సమ్మె గ్రామీణ బంధు విజయవంతమైందని వారన్నారు బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామని వంటి వాగ్దానాలు మరిచి ప్రజల జీవితాలు అతులాకుతులం మార్చారని ఆరోపించారు కార్పొరేట్లకు రెండు లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాలను మాఫీ చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఆచారి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జ్వాలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ దేశ ప్రజలపై అధిక ధరలు పెంచి పన్నుల వాటాను 243 శాతానికి పెంచాలని అన్నారు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రతి వ్యక్తికి 200 రోజుల పరిధిలో 600 రూపాయల రోజు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాల ప్రజల కోసం 40 సంవత్సరాల నుండి కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన రైతులకు మేలు చేసే సూచనలు ఉన్నా వాటిని పక్కకు పెట్టి తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అన్నదాతల ఆందోళన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి తిరిగి కొనసాగించడానికి కుట్ట చేస్తున్నారని ఆరోపించారు ఆదాని అంబానీలను లాభం చేసే పనిలో ప్రధాని పదవి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు
ఈ ధర్నాకు ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మోహినుద్దీన్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పాణ్యం వెంకట్రావు, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, ఐఎఫ్టియు పట్టణ అధ్యక్షులు రావుల వీరేష్ ల అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు నాయకులు ఇందూరు సాగర్, బి ఆర్ టి యు యనమల్ల వెంకటేశం, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కత్తుల ఈశ్వర్ కుమార్, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకురాలు కే విజయలక్ష్మి, సరిత, రెండవ ఏఎన్ఎం జిల్లా కార్యదర్శి పద్మ, గీతా రాణి, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బైరబోయిన బిక్షం , ఎల్ఐసి ఏఓఐ నాయకులు నలపరాజు సైదులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు బాసాని వెంకటయ్య, కె శ్యాంసుందర్, వివిధ సంఘాల నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ , అవుట రవీందర్, జమాలుద్దీన్, నరసింహారెడ్డి, ఔరేశు మారయ్య, సలివోజు సైదాచారి, విశ్వనాధుల లెనిన్ ,గుండె రవి, రేవెల్లి యాదయ్య, నళిని,పల్లె నగేష్, శంబిరెడ్డి, సైదులు, హనుమంతు నాయక్, కత్తుల యాదయ్య, ఉపేందర్ , చంద్రమ్మ లింగమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు.