Praneet Rao: ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురు..
On
అయితే విచారణ విషయాలను మీడియాకు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ సరైన వసతులు లేవని పిటిషన్ లో తెలిపారు. ప్రణీత్ రావు తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదించారు.
కింది కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రణీత్ రావును కస్టడీలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తున్న పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన ఏసీపీ రమేష్ కు, ప్రణీత్ రావు కేసు దర్యాప్తుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ప్రణీత్ రావు కూడా తన కుటుంబ సభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
