Rachakonda CP: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి

రాచ‌కొండ సీపీ తరుణ్ జోషి ఐపిఎస్

Rachakonda CP: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి

హైద‌రాబాద్‌, క్విక్ టుడే : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ ఈ రోజు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్, బీబీనగర్ పోలీసు స్టేషన్, భువనగిరి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజలతో మమేకమై పని చేయాలని, బాధితులు ధైర్యంగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పని వాతావరణం ఉండాలని సూచించారు.

మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చేతిలో హింసను, నిరాదరణ ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 8712662111 నంబర్ కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్బంగా కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపిఎస్, భువనగిరి ఏసిపి, మరియు ఇతర సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?