Rising price of turmeric: ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతున్న పసుపు ధర.. క్వింటాల్‌కి ఎంతంటే..?
పసుపు లేకుండా మన వంట కూడా చేయము.పురాతన కాలం నుంచి వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు.దీనిని ఎక్కువగా భారతీయులు ఇష్టపడతారు.పసుపు యాంటీబయోటిక్ గానే కాకుండా యాంటీఇంప్లే మెంటరి లక్షణాలతోనూ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.పసుపు అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటుంది.
గత పది సంవత్సరాలగా ఎన్నడూ లేని విధంగా పసుపు ధర క్వింటా ల్ 20వేల వరకు పెరిగింది. పెట్టుబడి ఖర్చులు పెనుబారంగా మారినా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకపోయినా సాంప్రదాయ పంట పసుపును మాత్రం రైతులు పండిస్తూనే ఉన్నారు..
గిట్టుబాటు ధరలు లేకపోయినా కూడా సంవత్సరాల తరబడి పసుపు పంటను సాగు చేయకుండా వదలట్లేదు. ఎప్పటికైనా కలిసి వస్తుందని ఆశ వాళ్లని ముందుకు నడిచేలా చేస్తుంది. అయితే ఈసారి మాత్రం అంచనాకి మించి గిట్టుబాటు ధర రావటంతో రైతులకు సంతోషాన్ని ఇస్తుంది. పసుపు రాష్ట్రంలో గిట్టుబాటు ధర 2011లో క్వింటా ల్ సరాసరి ధర13,400 పలికింది.
దాని తర్వాత నాలుగేళ్లకు అనగా 2015లో రూ.10,000 లకు వచ్చింది.పది సంవత్సరాల తర్వాత అనగా ఇప్పుడు 15 వేలకు పైగా పెరిగింది.రైతులు ఊహించని విధంగా గత సంవత్సరం కంటే ఇప్పుడు మరింత రెట్టింపుతో పెరిగింది. పంట ధర సుమారుగా 10 వేలకు పైగా పలకటంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. పదేళ్ల తర్వాత పసుపు ధర ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు.
ఈ కొత్త ధరల వలన పసుపు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.పసుపు పంటకు కనీస మద్దతు ధర 15000 నిర్ణయించాలని కొంతకాలం గా రైతులు డిమాండ్ చేశారు. అయితే రైతులు కోరిన విధంగా ధరలు పెరగటం వలన రైతులు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.. రైతులు సాధారణంగా సాగు విధానంలో ఎకరాకు 20 క్వింటాల్ వరకు దిగుబడి తీస్తారు.

అయితే బెడ్ పద్ధతి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎకరాకు30 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు హర్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులకు మంచి లాభాలు చేకూరుతాయి.రైతులల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి.
బోర్లు,బావులు,వాగులు సౌకర్యం ఉన్నవాళ్లంతా కూడా పెద్ద మొత్తం లో పంట సాగు చేయటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా పసుపు రికార్డు ధర పలకడంతో ఈసారీ సాగు విస్తీర్ణం పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు..
