Sammakka-saralakka : సీతారాంపురం లో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

వన ప్రవేశం చేసిన త‌ల్లులు 

Sammakka-saralakka : సీతారాంపురం లో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

Sammakka-saralakka : గుండాల, క్విక్ టుడే : గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారమ్మ జాతర గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ఒట్టిపల్లి భిక్షపతి డప్పు డోలు వాయిద్యాలతో కోయ వారి నృత్యాలు, వారి ప్రదర్శనతో  ఊరంతా ఊరేగింపులు జరిపి మాసానిపల్లి నుంచి, సీతారాంపురం గ్రామంలో బోనాలు, ఎర్రబోళ్ల నుండి అమ్మవారి గద్దలవరకు తీసుకు రావ‌డంతో జాతర ప్రారంభమై శనివారం తల్లులు వన ప్రవేశం చేయ‌డంతో కార్య‌క్ర‌మం ఘనంగా నిర్వహించారు. చుట్టుప‌క్క‌ల మండ‌లాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో త‌ర‌లి వ‌చ్చి  అమ్మవారిని దర్శించుకున్నారు. గిరిజన సంప్ర‌దాయాల‌తో ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ సమ్మక్క సారలమ్మ కావ‌డం విశేషం. ఈ జాతరలో ఎలాంటి ధూపకం వేధింపులు లేకుండా భక్తులను దోచుకోకుండా భక్తులు ఇష్టానుసారంగా జరుపుకున్నారు.

ఈ జాతర శ‌నివారం ప్ర‌శాంతంగా ముగియ‌డంతో పూజారి పొట్టి పల్లి భిక్షపతి ఆయా గ్రామాల నుంచి వ‌చ్చిన భ‌క్తులంద‌రికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ ,ఎస్సై తదితరులు జాతర నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాత‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించ‌డంతో విజయవంతం అయిందని తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పూజలు జరుపుతామని, వివిధ గ్రామాల నుండి  భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు అని తెలిపారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?