Collector Gautham: 9వ తేదీ వరకు ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
On
మేడ్చల్ కలెక్టరేట్, క్విక్ టుడే : ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 9 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కలెక్టరేటులోని విసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతు ధరణి పోర్టల్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయం పై ఆర్డీఓలకు, తహసీల్దార్లకు, ధరణి ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గడువు లోపల పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ధరణి పోర్టల్ లో ఉన్న మాడ్యూల్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఒక్క మాడ్యూల్ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్ లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయి లో కలెక్టరేట్ కు సమర్పించాలని అన్నారు. చాల జాగరూకతతో పాటు వేగవంతంగా ఈ స్పెషల్ డ్రైవ్ ను పూర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
